Watch: సర్కస్ ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకున్న సింహాలు.. తర్వాత ఏం జరిగిందంటే?

Viral Video | సర్కస్‌ ఎన్‌క్లోజర్‌ నుంచి గ్యాలరీలోకి వచ్చిన రెండు సింహాలను చూసి వీక్షకులు భయాందోళన చెందారు. తమ సీట్ల నుంచి లేచి ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీంతో అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. Viral Video | సింహాం.. ఆ పేరు విన‌గానే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. మ‌రి అలాంటి మృగాలు స‌ర్క‌స్ బోనులో నుంచి బ‌య‌ట‌కు దూకి, జ‌నాల‌పైకి దూసుకొస్తే.. గుండె ఆగినంత ప‌ని అవుతుంది. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే […]

Watch: సర్కస్ ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకున్న సింహాలు.. తర్వాత ఏం జరిగిందంటే?

Viral Video | సర్కస్‌ ఎన్‌క్లోజర్‌ నుంచి గ్యాలరీలోకి వచ్చిన రెండు సింహాలను చూసి వీక్షకులు భయాందోళన చెందారు. తమ సీట్ల నుంచి లేచి ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీంతో అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

Viral Video | సింహాం.. ఆ పేరు విన‌గానే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. మ‌రి అలాంటి మృగాలు స‌ర్క‌స్ బోనులో నుంచి బ‌య‌ట‌కు దూకి, జ‌నాల‌పైకి దూసుకొస్తే.. గుండె ఆగినంత ప‌ని అవుతుంది. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లుయోయాంగ్ ప్రాంతంలో వెలుగు చూసింది.

స‌ర్క‌స్‌లో భాగంగా ఓ రెండు సింహాల‌ను పెద్ద ఎన్‌క్లోజ‌ర్‌లో ఉంచారు. అదే ఎన్‌క్లోజ‌ర్‌లో ఇద్ద‌రు ట్రైన‌ర్లు కూడా ఉన్నారు. ఇక ఆ మృగాల‌తో ఆ ట్రైన‌ర్లు ప‌లు ర‌కాల విన్యాసాలు చేయిస్తున్నారు. అవి గాండ్రిస్తూనే విన్యాసాల‌కు స‌హ‌క‌రిస్తున్నాయి. అయితే రింగ్‌లో నుంచి దూకే స్టంట్ చేయాలి సింహాలు.

కానీ ఆ మృగాలు ఎందుకో ఆ విన్యాసం చేయ‌లేదు. ఒక్క‌సారిగా ఆ రెండు సింహాలు బోనులో నుంచి త‌ప్పించుకుని, జ‌నాల‌పైకి దూకాయి. దీంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన జ‌నాలు త‌మ పిల్ల‌ల‌ను తీసుకొని ప‌రుగులు పెట్టారు. అయితే ఎన్‌క్లోజ‌ర్ స‌రిగా లాక్ చేయ‌క‌పోవ‌డంతో.. సింహాలు సులువుగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు స‌ర్క‌స్ నిర్వాహ‌కులు తెలిపారు.

ప్రేక్ష‌కుల అరుపుల‌తో ఆ ప్రాంత‌మంతా దద్ద‌రిల్లింది. మొత్తానికి ఆ రెండు సింహాల‌ను ట్రైన‌ర్లు బంధించి బోనులో వేశారు. ఈ ఘ‌ట‌న‌తో స‌ర్క‌స్ నిలిపివేయాల‌ని అధికారులు ఆదేశించారు. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం సింహాలు బోను నుంచి బ‌య‌ట‌కు దూసుకొచ్చిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. సింహాల‌ను బంధించి, వాటిని హింసిస్తున్న తీరును జంతు ప్రేమికులు త‌ప్పుబ‌ట్టారు.