పిలిచి భోజనం పెట్టలేని దద్దమ్మవు.. నా సంపాదన ఎంతో తెలుసుకో లోకేశ్ అంకుల్: రోజా ఫైర్
Lokesh Uncle is an Ironleg: Roja Fire Lokesh Uncle is an Ironleg: Roja Fire విధాత: జబర్దస్త్ ఆంటీ.. డైమండ్ రాణి అంటూ తనమీద లోకేష్ చేసిన కామెంట్లను రోజా అంతే వేగంగా తిప్పికొట్టారు. నిన్న నగరిలో పాదయాత్ర చేసిన లోకేష్ రోజా మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు ప్రతి ఊళ్ళో ఒక్కో విల్లా ఉందని.. ఒక్కో మండలాన్ని తన కుటుంబీకులకు ధారాదత్తం చేసారని.. ఇసుక.. కాంట్రాక్టులు వంటివి చేస్తూ దోచుకుంటున్నారని […]

Lokesh Uncle is an Ironleg: Roja Fire Lokesh Uncle is an Ironleg: Roja Fire
విధాత: జబర్దస్త్ ఆంటీ.. డైమండ్ రాణి అంటూ తనమీద లోకేష్ చేసిన కామెంట్లను రోజా అంతే వేగంగా తిప్పికొట్టారు. నిన్న నగరిలో పాదయాత్ర చేసిన లోకేష్ రోజా మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు ప్రతి ఊళ్ళో ఒక్కో విల్లా ఉందని.. ఒక్కో మండలాన్ని తన కుటుంబీకులకు ధారాదత్తం చేసారని.. ఇసుక.. కాంట్రాక్టులు వంటివి చేస్తూ దోచుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. దానికి ప్రతిగా రోజా తీవ్రంగా స్పందించారు. ఆమె మాటల్లోనే..
పొరుగు రాష్ట్రాల నుంచి జనం తరలింపు
లోకేశ్ చేస్తుంది పాదయాత్ర కాదు.. అది జోకేశ్ యాత్ర అని చెప్పాలి. పాదయాత్ర కోసమని ముందురోజు రాత్రి ఏడు గంటలకే నగరి నియోజకవర్గంలోకి వచ్చిన అతను.. తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు పాదయాత్రకు జనాలు రాక టెంటులోనే పడుకున్నాడు. పాపం వాడి పరిస్థితి చూస్తే చాలా జాలేసింది.
లోకల్ జనాలు రాకపోవడంతో అటు బెంగుళూరు, ఇటు చెన్నై నుంచి అప్పటికప్పుడు జనాన్ని తెచ్చుకుని ఏదో హడావిడి చేశారు. లోకల్ జనాలు లేకుండా పాదయాత్రలో లోకేశ్ వాగే చెత్తవాగుడు చాలా హాస్యాస్పదంగా ఉంది. అతను మాట్లాడిన మాటల్లో కొన్నింటికి నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నా.
అవినీతికి కేరాఫ్ నారా కుటుంబం
మా ఫ్యామిలోని వారి పేర్లు చెబుతూ అవినీతికి పాల్పడ్డామని లోకేశ్ మాట్లాడాడు. నేను సినిమా ఆర్టిస్టు దగ్గర్నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నంత వరకు నా అన్నలు, నా భర్త నన్ను సపోర్టు చేస్తూ సహాయంగా ఉండటంలో తప్పేముంది? లోకేశ్ అనే వెధవకు నా అన్నల పేర్లు కూడా ఎత్తే అర్హత లేదు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే, అది నారా కుటుంబమేనని చెప్పాలి. చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మిణి, లోకేశ్‌లే అవినీతి చక్రవర్తులుగా గుర్తింపు పొందారు.
చిత్తూరు జిల్లాలో పాలు పోసేవాళ్లు, కూరగాయలు పండించి అమ్మేవాళ్లు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. కానీ, వాళ్ల కష్టాన్ని దోచుకుని హెరిటేజ్ నడుపుతూ ఏ విధంగా కోటీశ్వరుడయ్యాడో చంద్రబాబు బహిరంగంగా సమాధానం చెప్పాలి..? కేవలం, రెండెకరాల రైతు చంద్రబాబు, ఏ విధంగా వేల కోట్లకు పడగలెత్తాడో చిత్తూరు ప్రజలకు తెలుసు కనుకనే ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆయన చావుతప్పి కన్ను లొట్ట పడ్డ చందంగా నానాపాట్లు పడుతూ అవమానాల పాలవడం అందరూ చూస్తూనే ఉన్నారు.
లోకేశ్ పక్కనే ఎర్ర చందనం దొంగలున్నారు
ఇసుక దొంగల్ని, చందనం దొంగల్ని తన పక్కన పెట్టుకుని లోకేశ్ మాట్లాడుతున్నాడంటే.. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి.. అంటూ అందరూ నవ్వుకుంటున్నారు. ఈరోజు లోకేశ్ ఎవరినైతే పక్కన బెట్టుకుని గెలిపించమని మాట్లాడుతున్నాడో.. వాడే పెద్ద చందనం దొంగ.. ఇసుక దోచేసిన పెద్ద దొంగగా.. లిక్కర్ కేటుగాడు అని.. ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎవడో కరోనా ముఖం గాడు రాసిచ్చిన స్క్రిప్టులో నాలుగు లైన్లు చదవడానికే లోకేశ్ అంత ఇబ్బందిపడిన వాడు.. రాజకీయాల్లో గట్టిగా ఏ ఒక్క విషయంపైనా స్పష్టంగా మాట్లాడలేని వాడు.. మా గురించి ఏవేవో అవాకులు చెవాకులు మాట్లాడితే నగరి ప్రజలెవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరు.
బాబుకు సవాల్: మీ ఆస్తుల మీద సీబీఐ విచారణకు సిద్ధమా..?
ఏ కేసు పెట్టినా స్టేలు తెచ్చుకుని తప్పించుకుని తిరిగే అలవాటున్న చంద్రబాబుకు, లోకేశ్‌కు నేనొక సవాల్ విసురుతున్నాను. మీ ఆస్తుల మీద.. నా ఆస్తుల మీద సీబీఐ చేత ఎంక్వైరీ చేయించడానికి సిద్ధమేనా..? ఎవరివి అవినీతి ఆస్తులు.. ఎవరివి కష్టపడి షూటింగులు చేసుకుని సంపాదించిన సొమ్మనే సంగతి ప్రజలకు అర్ధమౌతుంది గదా.. ? హైదరాబాద్‌లో ఉన్న మీ ఇంట్లోకి డబ్బు సంచులు ఏ విధంగా వచ్చేవో బయటకి వస్తే చాలంది.
ఇక ఈ సారి వచ్చే ఎన్నికల సమయానికి చంద్రబాబు పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని, కనీసం కిందటి సారి దక్కించుకున్న 23 సీట్లు కూడా గల్లంతవడం ఖాయం. ఇప్పటికైనా లోకేశ్, చంద్రబాబు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ముగించాలనేది అర్థం చేసుకోవాలి. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనుబడుతుందన్న సామెతగా లోకేశ్ ఒక అవినీతి తండ్రి పెంపకంలో పెరిగి.. అందరూ తను, తన తండ్రి మాదిరిగానే అవినీతిపరులని అనుకుంటున్నాడు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను సంతకాలు పెట్టే కొద్దీ వచ్చిన సూటుకేసులను తీసుకెళ్లి లోకేశ్ తన తల్లికి ఇస్తే.. ఆమె లెక్కలేసి మరీ వాటన్నింటినీ హెరిటేజ్ పెట్టుబడులకు తరలించడమనేది అందరికీ తెలిసిన బాగోతమే.. అవినీతి సొమ్ముతో కట్టిన ఇంటి గృహప్రవేశానికి ఎవరినీ పిలిచి భోజనం పెట్టలేని దద్దమ్మ లోకేశ్.. అదే నేను షూటింగులు చేసి కష్టపడిన సంపాదనతో కట్టుకున్న ఇల్లు కనుక.. నా ఇంటి గృహప్రవేశానికి అందర్నీ పిలిచాను. నేను 30 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. నా సంపాదన ఎంతో.. నేనెంత ఇన్‌కం ట్యాక్స్ కట్టానో తెలుసుకో లోకేశ్..
లోకేశ్ యాత్రలో.. జై జగనన్న నినాదాలు
లోకేశ్ ‘నీకు నీ తండ్రి సంస్కారం నేర్పించలేదు.. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు.. వీడు ’ అని మాట్లాడతావా..? అంటూ మండిపడ్డారు. ఈ వారాహి పాదయాత్రకు జనం రావట్లేదని.. ఆ వారాహిని చంద్రబాబు ఇంకా వెయిటింగ్‌లో పెట్టాడని, బెంగళూరు, చెన్నైల నుంచి తీసుకువచ్చిన జనాలు నీ పాదయాత్రలో ఎంతసేపు ఉంటారు లోకేశ్ అంటూ దుయ్యబట్టారు.
నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు రోడ్ల పక్కన నిల్చొన్న జనం జై జగనన్న అనే నినాదాలు లోకేశ్‌కి వినిపించడం లేదా..? ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ, కులమతాలు, రాజకీయాలు లేకుండా సంక్షేమం అందిస్తున్న మంచి ముఖ్యమంత్రి కనుక జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఆంధ్రుల ఆరాధ్యదైవంగా జనం కీర్తిస్తున్నారు. మహిళా ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లోనూ అమలు కానీ సంక్షేమ పథకాలు ఆంధ్రలో నేడు మహిళలకు అమలు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన అంటేనే జనం ఇదేం ఖర్మరా బాబూ.. అంటూ తలపట్టుకుంటున్నారు.
లోకేశ్ అంకుల్ ఒక ఐరెన్‌లెగ్..
లోకేశ్ అడుగుపెట్టిన దగ్గర్నుంచి రాష్ట్రానికి, ఎన్టీఆర్ కుటుంబానికి, మీ పార్టీ నేతలకి ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది. నీ అడుగు మహత్యం వల్ల.. జరిగిన నష్టాలకు సంబంధించి లెక్కలు తీసి చూసుకుంటే తెలుస్తుంది. లోకేశ్ రాజకీయ ఎంట్రీతోనే చంద్రబాబు రాజకీయ పతనం మొదలైంది. అతని పాదయాత్ర అనగానే జనాలు పిట్టల్లా చనిపోతున్నారు. లోకేశ్‌లాంటి ఐరెన్‌లెగ్ అంకుల్ పాదయాత్ర అనగానే జనాలు భయపడి బయటకు రాకుండా ఇళ్లకు తలుపులేసుకుంటున్నారు.
జనాల కోసం లోకేశ్ పది గంటలు, పన్నెండు గంటలు వేచి చూస్తూ అభాసు పాలవుతున్నాడు. అదే నేను ఎక్కడికి వెళ్లినా జనాలు బ్రహ్మరథం పడతారు. మరి, నేను, లోకేశ్ ఒకచోటికి వెళ్తే జనాలు ఎవరికి హారతులు పడతారో.. డిబేట్లు పెట్టుకుని చర్చించుకోవాలి. జబర్దస్త్ అనేది మంచి ఆరోగ్యకర, ఆహ్లాద కరమైన కామెడీ షో. దాన్ని కూడా ఒక బూతు కార్యక్రమంగా లోకేశ్ మాట్లాడుతున్నాడంటే.. మహిళలు అతన్ని దేంతో కొడతారో దాంతో ఖచ్చితంగా కొడతారు.” అంటూ ఎదురు దాడి చేశారు.