5 ఏండ్ల క్రితం నోస్ రింగ్ అదృశ్యం.. ఊపిరితిత్తుల్లో ప్రత్యక్షం
విధాత : ఐదేండ్ల క్రితం అదృశ్యమైన నోస్ రింగ్.. అతని ఊపిరితిత్తుల్లో ప్రత్యక్షమైంది. అమెరికాకు చెందిన జాయ్ లైకిన్స్(35) ముక్కుకు రింగ్ ధరించేవాడు. 5 ఏండ్ల క్రితం ఓ రాత్రి అతని నోస్ రింగ్ అదృశ్యమైంది. ఆ తర్వాత అతను తాను నిద్రించిన మంచంతో పాటు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాడు. రింగ్ ఎక్కడా కనిపించలేదు. ఇక ఆ విషయం మరిచిపోయాడు జాయ్. అయితే ఇటీవల లైకిన్స్‌కు తీవ్రమైన దగ్గు వచ్చింది. వెన్నునొప్పి కూడా తీవ్రమైంది. దీంతో అతను […]

విధాత : ఐదేండ్ల క్రితం అదృశ్యమైన నోస్ రింగ్.. అతని ఊపిరితిత్తుల్లో ప్రత్యక్షమైంది. అమెరికాకు చెందిన జాయ్ లైకిన్స్(35) ముక్కుకు రింగ్ ధరించేవాడు. 5 ఏండ్ల క్రితం ఓ రాత్రి అతని నోస్ రింగ్ అదృశ్యమైంది. ఆ తర్వాత అతను తాను నిద్రించిన మంచంతో పాటు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాడు. రింగ్ ఎక్కడా కనిపించలేదు. ఇక ఆ విషయం మరిచిపోయాడు జాయ్.
అయితే ఇటీవల లైకిన్స్‌కు తీవ్రమైన దగ్గు వచ్చింది. వెన్నునొప్పి కూడా తీవ్రమైంది. దీంతో అతను వైద్యులను సంప్రదించాడు. మొదట న్యూమోనియా అని భావించారు వైద్యులు. చివరకు అతని లంగ్స్‌ను ఎక్స్‌రే తీయగా, కుడి ఊపిరితిత్తిలో రింగ్‌ను కనుగొన్నారు. ఆ ఎక్స్‌రేను జాయ్‌కు చూపించగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
మొత్తానికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి, 0.6 ఇంచుల రింగ్‌ను బయటకు తీశారు. ఆ రింగ్ ఊపిరితిత్తులకు ఎలాంటి హానీ తలపెట్టలేదని డాక్టర్లు తెలిపారు. ఇక నుంచి నోస్ రింగ్స్ ధరించనని జాయ్ చెప్పాడు. తన వద్ద మొత్తం 12 నోస్ రింగ్స్ ఉన్నాయని, వాటన్నింటిని భద్రంగా దాచుకుంటానని తెలిపాడు.