Lovers | మూడేండ్లుగా ప్రేమించుకుంటున్న ఓ జంట.. ముచ్చటగా ఇటీవలే మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కానీ ప్రియుడు మరొకరితో మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా, ఆ విషయం తెలుసుకుని, అతని మర్మాంగాన్ని కోసేసింది ప్రియురాలు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి.. తన బంధువుల అమ్మాయిని మూడేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట.. ఇటీవలే ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే […]
Lovers | మూడేండ్లుగా ప్రేమించుకుంటున్న ఓ జంట.. ముచ్చటగా ఇటీవలే మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కానీ ప్రియుడు మరొకరితో మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా, ఆ విషయం తెలుసుకుని, అతని మర్మాంగాన్ని కోసేసింది ప్రియురాలు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి.. తన బంధువుల అమ్మాయిని మూడేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట.. ఇటీవలే ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు.
అయితే జవాన్ ఈ నెల 23వ తేదీన మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రియురాలికి తెలిసింది. దీంతో ప్రియురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. పక్కా ప్రణాళిక ప్రకారం.. ప్రియుడ్ని బీహార్ రాజధాని పాట్నాలోని ఓ హాటల్కు రప్పించింది.
ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియుడి మర్మాంగాన్ని పదునైన ఆయుధంతో కోసేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్టు చేశారు. బాధిత వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.