ఐదురాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికలు..! సిలిండర్ ధరలు పెంచుతూ షాక్ ఇచ్చిన కేంద్రం..!
ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గురువారంతో ముగిశాయి. డిసెంబర్ ఒకటిన వాణిజ్య సిలిండర్‌ను ధరలను పెంచింది.
విధాత: ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గురువారంతో ముగిశాయి. డిసెంబర్ ఒకటిన వాణిజ్య సిలిండర్‌ను ధరలను పెంచింది. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.21 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1996.50కి చేరింది. నవంబర్ నెలాఖరు వరకు 19 కేజీల సిలిండర్ రూ.1775కి అందుబాటులో ఉండేది.
ఇక కోల్‌కతాలో రూ.1908, ముంబయిలో రూ.1749 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.1968.50కి చేరింది. ఇక ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో జైపూర్ (రాజస్థాన్) రూ.1819, భోపాల్ (మధ్యప్రదేశ్) రూ.1804, రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) రూ.2004, హైదరాబాద్ (తెలంగాణ)లో రూ.2024కి ఎగిసింది. వాస్తవానికి చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీని సిలిండర్ ధరలను సమీక్షించి, పెంచడమో.. తగ్గించడమే చేస్తుంటాయి. అయితే, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ మాత్రం పెరగకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం హైదరబాద్‌లో 14 కేజీల సిలిండర్ రేటు రూ.970కిపైగా పలుకుతున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram