‘శోభకృత్’లో హ్యాట్రిక్ సాధిస్తారు.. పంచాంగ పండితులు! మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు
విధాత: సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయం లో ఉగాది వేడుకలు సాంప్రదాయ బద్దంగా వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రి జగదీష్ రెడ్డి గారి కి వేదాశీర్వచనం అందజేశారు. శోభకృత్ నామ ఉగాది రోజున తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టు వస్త్రాలు ధరించిన మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల కు, బీ.ఆర్.ఎస్ నేతలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు పంచాగ శ్రవణాన్ని వినిపించి మకరరాశికి […]

విధాత: సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయం లో ఉగాది వేడుకలు సాంప్రదాయ బద్దంగా వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రి జగదీష్ రెడ్డి గారి కి వేదాశీర్వచనం అందజేశారు.
శోభకృత్ నామ ఉగాది రోజున తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టు వస్త్రాలు ధరించిన మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల కు, బీ.ఆర్.ఎస్ నేతలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
వేద పండితులు పంచాగ శ్రవణాన్ని వినిపించి మకరరాశికి చెందిన శోభకృత్ నామ సంవత్సరంలో మంత్రి గారికి అంతా జయమే కలుగుతుందని, ముచ్చటగా మూడవ సారి ఆయన హ్యట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. అనంతరం స్వయంగా ఉగాది పచ్చడిని తయారు చేసిన మంత్రి, జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అధికారులకు అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శోభకృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య పోరాటంతో తెలంగాణ సాధించినమన్నారు. తెలంగాణ జాతి అంతా ఒక్కటేనని, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నారు.
నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా పోలీసు, రెవిన్యూ, పంచాయితీ, వైద్య శాఖ లకు చెందిన అధికారులు , బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు మంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.