Mahabubnagar | కాంగ్రెస్‌లోకి వలసల వెల్లువ
Mahabubnagar కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న ఇతర పార్టీల నేతలు జిల్లాలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న గ్రాఫ్ కాంగ్రెస్‌లో చేరుతామని ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయoటున్న కాంగ్రెస్ నేతలు విధాత, ప్రతినిధి మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల నేతల సమీకరణాలు తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో రాజకీయాలు మరింత ఇంట్రెస్ట్ గా మారాయి. జిల్లాకు చెందిన […]

Mahabubnagar
- కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న ఇతర పార్టీల నేతలు
- జిల్లాలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న గ్రాఫ్
- కాంగ్రెస్‌లో చేరుతామని ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు
- జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి
- రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయoటున్న కాంగ్రెస్ నేతలు
విధాత, ప్రతినిధి మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల నేతల సమీకరణాలు తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో రాజకీయాలు మరింత ఇంట్రెస్ట్ గా మారాయి. జిల్లాకు చెందిన నేత ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టాకా జిల్లా రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. జిల్లాకు చెందిన ఇతర పార్టీల నేతలంతా కాంగ్రెస్ వైపు దృష్టి మరల్చుతున్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ఉరకలేస్తున్నారు.
ఒకే నియోజకవర్గానికే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్ కు వలసలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేష్ రెడ్డి తో పాటు ముఖ్య నేతలు త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే వీరంతా కాంగ్రెస్ రాష్ట్ర నేతలను కలిసి తమ అభిప్రాయం తెలిపారు.
ఇక్కడ మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వీరి రాకను వ్యతిరేకిస్తున్నారు. వీరిద్దరి మధ్య అవగాహన కుదిరి ఒక్కతాటి పైకి వస్తే కాంగ్రెస్ పార్టీ కి ఈ నియోజకవర్గం లో తిరుగు లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ కు చెందిన సరితా తిరుపతయ్య అక్కడి ఎమ్మెల్యేతో విభేధించి పార్టీ వీడుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసు కుంది. ఈమె వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉండేందుకు సిద్ధమవుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆ ర్ ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఈ నెల 20న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలని అనుకున్నారు. ఈ సభ వాయిదా పడడంతో జూపల్లి చేరిక వాయిదా పడింది. ఇక్కడ జూపల్లి చేరికను టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత చింతల పల్లి జగదీశ్వర్ రావు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ లో జగదీశ్వర్ రావు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పలు వార్డులకు చెందిన ఇతర పార్టీ ల నాయకులు కాంగ్రెస్ లో చేరారు.
నారాయణ పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోయిలకొండ మండలం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మణికొండ, సూరారం పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కి చెందిన కార్యకర్తలు వంద మంది వరకు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లో భారీ గా చేరికలు ఉంటాయని శివకుమార్ రెడ్డి ప్రకటించారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు, పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వల్ కలిసి కండువాలు వేసి పార్టీ లో కి ఆహ్వానించారు.
ఇదే నియోజకవర్గం బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఆయన కాంగ్రెస్ లో చేరితే ఇక్కడ ఆ పార్టీ బలం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ లో ఊహించని విధంగా చేరికలు ఉంటాయని ఇక్కడి నేతలు అంటున్నారు.