Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..8మంది మృతి!

Train Accident: మహారాష్ట్రలోని ముంబ్రా దివా స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో 8మంది మృతి చెందారు. రైలులో భారీ రద్దీ కారణంగా లోకల్ ట్రైన్ నుంచి పట్టాలపై జారిపడి 8మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి ఠాణే కసారా బయల్దేరిన లోకల్ ట్రైన్ లో ప్రయాణికులు అధిక రద్దీ కారణంగా వేలాడుతు ప్రయాణించారు. రైలు ముంబ్రా స్టేషన్ కు చేరుకుంటున్న క్రమంలో ప్రయాణికులు అదుపు తప్పి జారిపడ్డారు. అదే సమయంలో పక్కనే ఉన్న పట్టాలపై ఎక్స్ ప్రెస్ రైలు వెళ్లంది. ఇప్పటిదాకా ఈ ప్రమాదంలో 8మంది చనిపోగా మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రైల్వే పోలీసులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత సేపు అంతరాయం కలిగింది.