Mahesh Babu:మహేష్ బాబుకి జిరాక్స్ కాపీలా ఉన్న వ్యక్తి గురించి మీకు తెలుసా?
Mahesh Babu:సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబు తనదైన నటనటో ఎంతగానో అలరించాడు. కాని ఎక్కువ రోజులు ప్రేక్షకులి అలరించలేకపోయాడు. ఇక కృష్ణ మరో తనయుడు మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు త్వరలో రాజమౌళితో హాలీవుడ్ రేంజ్‌లో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రంతో మహేష్ బాబు క్రేజ్ ఓ […]

Mahesh Babu:సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబు తనదైన నటనటో ఎంతగానో అలరించాడు. కాని ఎక్కువ రోజులు ప్రేక్షకులి అలరించలేకపోయాడు. ఇక కృష్ణ మరో తనయుడు మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు త్వరలో రాజమౌళితో హాలీవుడ్ రేంజ్‌లో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రంతో మహేష్ బాబు క్రేజ్ ఓ రేంజ్‌లో పెరగనుంది.అయితే ఇప్పుడు మహేష్ బాబు వారసుడు ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా మహేష్ బాబు స్వాగ్ ను ఎవరు బీట్ చేయలేరనే చెప్పాలి. ఇక ఎవరు ఎన్నిసార్లు మహేష్ బాబుని ఇమిటేట్ చేసినా కూడా అచ్చాం మహేష్ లాగా ఉండే వాళ్ళు ఒకరు కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు. మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ పోలికలతో కనిపిస్తాడు . సరేఏ తండ్రి యాటిట్యూడ్ ను స్వాగ్ ను మ్యాచ్ చేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం అతని దృష్టి అంతా చదువులపైనే ఉంది. గౌతమ్ విదేశాలలో చదువులతో బిజీగా ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్దగా సందడి కనిపించదు. సితార సందడి చేసినట్టు గౌతమ్ చేయడు.
అయితే గౌతమ్ అంత సందడి చేయకపోతే ఏంటి అచ్చం మహేష్ ను దింపడానికి మేనల్లుడు ఉన్నాడుగా అంటున్నారు ఘట్టమనేని అభిమానులు.. మహేష్ మేనల్లుడు, మహేష్ బాబు అక్క ప్రియదర్శిని, బావ అలాగే హీరో సుధీర్ బాబు కొడుకు అయిత చరిత్ మానస్ .. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి అలరించగా, ఇప్పుడు హీరోగా కూడా అలరించేందుకు సిద్దమయ్యాడు. చరిత్ ఇప్పుడు చాలా పెద్ద కాగా , అచ్చం మహేష్ బాబు లా జిరాక్స్ కాపీలా కనిపిస్తున్నాడు. చరిత్.. నడక ,నవ్వు, ఆటిట్యూడ్ మొత్తం కూడా మహేష్ బాబుకు జిరాక్స్ లా ఉండడంతో రానున్న రోజులలో జూనియర్ మహేష్‌లా చరిత్ అదరగొట్టడం ఖాయం అని ఘట్టమనేని ఫ్యాన్స్ అంటున్నారు.