ఉగ్రమూక అక్రమ చొరబాటు అడ్డగింత
జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)లో ఉగ్రవాదుల ముఠా చొరబాటు ప్రయత్నాన్ని శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు అడ్డుకున్నాయి

- జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దులో
- శనివారం తెల్లవారుజామున ఘటన
- బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం
విధాత: జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)లో ఉగ్రవాదుల ముఠా చొరబాటు ప్రయత్నాన్ని శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. తెల్లవారుజామున అఖ్నూర్‌లోని ఖౌర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా నలుగురు భారీ ఆయుధాలతో కూడిన ఉగ్రవాదుల బృందం భారత్ వైపు చొరబడేందుకు ప్రయత్నించింది.
అది గమనించిన భద్రతా బలగాలు హెచ్చరించాయి. కానీ, ఉగ్రమూక వెనక్కి తగ్గకపోవడంతో చొరబడిన ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరిపారు. వారిలో ఒకరు తగిలి బుల్లెట్లు కిందపడిపోయారు. ఉగ్రవాది మృతదేహాన్ని అతని సహచరులు ఐబీ మీదుగా వెనక్కి లాగి తీసుకెళ్లారు. ఈ విషయాన్నిఆర్మీ అధికారులు సోషల్‌మీడియా వేదిక వెల్లడించారు.