Viral Video | బంగ్లాదేశ్ సైనికులను తరిమిన మేఘాలయ మహిళ..
Viral Video | భారత్ భూభాగంలోకి ప్రవేశించిన ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులను ఓ మహిళ తరిమికొట్టింది. తమ గ్రామంలోకి ఎందుకు ప్రవేశించారంటూ ఆ మహిళ ప్రశ్నించింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు సైనికులు.. మేఘాలయలోని సౌత్ గారో హిల్స్ జిల్లాలోని రోంగరా ఏరియాలోకి బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రవేశించారు. అయితే ఏకే 47 తుపాకులు, లాఠీలతో గ్రామంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ సైనికులను చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలోని ఓ మహిళ వారిని ధైర్యంగా నిలదీసింది. […]

Viral Video | భారత్ భూభాగంలోకి ప్రవేశించిన ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులను ఓ మహిళ తరిమికొట్టింది. తమ గ్రామంలోకి ఎందుకు ప్రవేశించారంటూ ఆ మహిళ ప్రశ్నించింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు సైనికులు.. మేఘాలయలోని సౌత్ గారో హిల్స్ జిల్లాలోని రోంగరా ఏరియాలోకి బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రవేశించారు.
అయితే ఏకే 47 తుపాకులు, లాఠీలతో గ్రామంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ సైనికులను చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలోని ఓ మహిళ వారిని ధైర్యంగా నిలదీసింది. అక్రమంగా తమ గ్రామంలోకి ఎందుకు ప్రవేశించారంటూ ప్రశ్నించింది. అంతేకాదు సరిహద్దు వరకు వారిని తరిమికొట్టింది.
రోంగరా గ్రామంలోకి బంగ్లాదేశ్ సైనికులు ప్రవేశించిన విషయాన్ని ఆ దేశ సైనికాధికారుల దృష్టికి బీఎస్ఎఫ్ దళాలు తీసుకెళ్లాయి. అయితే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకునే క్రమంలోనే సరిహద్దు దాటినట్లు బంగ్లాదేశ సైన్యం తెలిపింది. అయితే స్థానికులను ఎవర్నీ కూడా బంగ్లాదేశ్ సైన్యం హింసించలేదు. కానీ భయాందోళనతోనే ఆ సైన్యాన్ని గ్రామస్తులు తరిమికొట్టారని తెలిపారు.
Meghalaya Villagers Chase Out 2 Bangladesh Border Guards. Video Viral https://t.co/P1lkJYeCC0 pic.twitter.com/XPsbKgdV9u
— NDTV (@ndtv) June 8, 2023