Malla Reddy | పొట్టలున్న పోలీసులకు పదోన్నతులివ్వకండి.. మంత్రి మల్లారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
Malla Reddy | హోం మంత్రికి రిక్వెస్ట్ విధాత: పోలీసులపై మంత్రి మల్లారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధి యమ్నంపేట్ లో నూతనంగా పోచారం ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో కలిసి పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఫిట్‌గా ఉండాలన్నారు. పొట్టలున్న పోలీసులకు శాఖాపరమైన పదోన్నతులు ఇవ్వొద్దని నా లాగా ఫిట్‌నెస్ ఉన్న వారికి మాత్రమే పదోన్నతులు కల్పించాలంటూ పక్కనే ఉన్న […]

Malla Reddy |
హోం మంత్రికి రిక్వెస్ట్
విధాత: పోలీసులపై మంత్రి మల్లారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధి యమ్నంపేట్ లో నూతనంగా పోచారం ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో హోంమంత్రితో కలిసి పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఫిట్‌గా ఉండాలన్నారు. పొట్టలున్న పోలీసులకు శాఖాపరమైన పదోన్నతులు ఇవ్వొద్దని నా లాగా ఫిట్‌నెస్ ఉన్న వారికి మాత్రమే పదోన్నతులు కల్పించాలంటూ పక్కనే ఉన్న హోంమంత్రి మహామూద్ అలీకి రిక్వెస్ట్ చేశారు.
మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలతో కొంత మంది పోలీసులు నొచ్చుకున్నా.. బయటికి మాత్రం చిద్విలాసం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.