Mamata Banerjee | పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ‌.. వీల్‌చైర్‌పై సీఎం మ‌మ‌త‌.. అస‌లేం జ‌రిగిందంటే..?

Mamata Banerjee | ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ళ్లీ వీల్‌చైర్‌పై ద‌ర్శ‌న‌మిచ్చారు. గ‌తంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. వీల్‌చైర్‌పై ప్ర‌చారం కొన‌సాగించిన మ‌మ‌త‌.. మ‌ళ్లీ ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ఆమె వీల్‌చైర్‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అస‌లేం జ‌రిగిందంటే..? నార్త్ బెంగాల్‌లో జులై 8వ తేదీన పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌ల్‌పాయ‌గుఢీ జిల్లా కేంద్రంతో పాటు క్రాంతీ గ్రామంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల స‌భ‌ల్లో ఆమె పాల్గొన్నారు. అనంత‌రం కోల్‌క‌తా […]

Mamata Banerjee | పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ‌.. వీల్‌చైర్‌పై సీఎం మ‌మ‌త‌.. అస‌లేం జ‌రిగిందంటే..?

Mamata Banerjee | ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ళ్లీ వీల్‌చైర్‌పై ద‌ర్శ‌న‌మిచ్చారు. గ‌తంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. వీల్‌చైర్‌పై ప్ర‌చారం కొన‌సాగించిన మ‌మ‌త‌.. మ‌ళ్లీ ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ఆమె వీల్‌చైర్‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అస‌లేం జ‌రిగిందంటే..?

నార్త్ బెంగాల్‌లో జులై 8వ తేదీన పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌ల్‌పాయ‌గుఢీ జిల్లా కేంద్రంతో పాటు క్రాంతీ గ్రామంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల స‌భ‌ల్లో ఆమె పాల్గొన్నారు. అనంత‌రం కోల్‌క‌తా బ‌య‌ల్దేరేందుకు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో బాగ్దోరా ఎయిర్‌పోర్టుకు బ‌య‌ల్దేరారు మ‌మ‌త‌.

కానీ ప్ర‌తికూల ప‌రిస్థితులు, భారీగా వ‌ర్షం కురియ‌డంతో సేవోక్ ఎయిర్‌బేస్‌లో అత్య‌వ‌స‌రంగా పైల‌ట్ హెలికాప్ట‌ర్‌ను ల్యాండ్ చేశాడు. అయితే హెలికాప్ట‌ర్ దిగే క్ర‌మంలో మ‌మ‌తకు గాయ‌మైంది. మోకాలికి, హిప్‌కి స్వ‌ల్ప గాయ‌మైంది. దీంతో న‌డ‌వ‌డానికి ఇబ్బంది ప‌డ్డ మ‌మ‌త‌ను భ‌ద్ర‌తా సిబ్బంది.. కోల్‌క‌తాలోని ఎస్ఎస్‌కేఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అక్క‌డ ఎంఆర్ఐ స్కానింగ్స్ నిర్వహించ‌గా, ఎడ‌మ‌ మోకాలు, లెఫ్ట్ హిప్ జాయింట్ స్వ‌ల్పంగా దెబ్బ‌త‌గిలింద‌ని, చికిత్స అవ‌స‌ర‌మని వైద్యులు సూచించారు. కానీ వైద్యుల ప్ర‌తిపాద‌న‌ను మ‌మ‌త తిర‌స్క‌రించింది. వీల్ చైర్‌లోనే హాస్పిట‌ల్ నుంచి ఇంటికి బయ‌ల్దేరింది సీఎం మ‌మ‌త‌.

మ‌రి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మ‌మ‌త వీల్‌చైర్‌పై నుంచే ప్ర‌చారం నిర్వ‌హిస్తారా? లేదా..? అన్న అంశంపై జోరుగా చ‌ర్చ సాగుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నాటి సానుభూతిని మ‌ళ్లీ పొందేందుకు ఈ అవ‌కాశాన్ని ఆమె వాడుకుంటారా? అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.