Pocharam Srinivas Reddy : అలా చేస్తే చెప్పుతో కొట్టండి
స్వార్థం కోసం పార్టీ మారలేదని అలా చేస్తే చెప్పుతో కొట్టాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, తన నిర్ణయం తప్పు అయితే రాజీనామాకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
విధాత : స్వార్థం కోసం తాను పార్టీ మారలేదని..అలా చేస్తే చెప్పుతో కొట్టండి అని మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఆశించి సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని.. అలా ఎవరైనా అనుకున్నా..నా నిర్ణయం తప్పు అయినా.. ఇక్కడే రాజీనామాకు సిద్ధమన్నారు. బాన్సువాడలో కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా పోచారం మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం వద్దకు వెళ్లానని పోచారం స్పష్టం చేశారు. నా నియోజకవర్గం కోసం నేను అడిగిన వాటిని గత సీఎం కేసీఆర్ ఇచ్చారని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నారని..ఇది కొంత మందికి గిట్టడం లేదన్నారు.
భూముల పంచాయతీ కోసమో, మాఫియా గ్యాంగ్ కోసమో నేను సీఎంను కలవలేదని..అలాంటి అవసరాలేవి నాకు లేవని స్పష్టం చేశారు. నాకు ఉన్న ఏకైక లక్ష్యం నా నియోజకవర్గం అభివృద్ధి..ఇక్కడి ప్రజల సంక్షేమానికి పనిచేయడమేనన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచానని, సాంకేతికంగా బీఆర్ఎస్ లో కొనసాగుతున్నానని, ఫిరాయింపు వివాదంపై స్పీకర్ విచారణ కొనసాగుతుందన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram