పెండ్లిరోజున భార్య‌ను ఇంప్రెస్ చేసేందుకు స్టంట్‌

పెండ్లి రోజును ఆలుమ‌గ‌లు గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకుంటారు. భార్య‌ను ఇంప్రెస్ చేయ‌డానికి భ‌ర్త‌, భ‌ర్త‌ను ఇంప్రెస్ చేయ‌డానికి భార్య పార్టీలు ఇస్తుంటారు.

పెండ్లిరోజున భార్య‌ను ఇంప్రెస్ చేసేందుకు స్టంట్‌
  • భ‌ర్త‌ను అరెస్టు చేసిన పోలీసులు..
  • పంజాబ్‌లోని మొహాలీలో ఘ‌ట‌న‌


విధాత‌: పెండ్లి రోజును ఆలుమ‌గ‌లు గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకుంటారు. భార్య‌ను ఇంప్రెస్ చేయ‌డానికి భ‌ర్త‌, భ‌ర్త‌ను ఇంప్రెస్ చేయ‌డానికి భార్య పార్టీలు ఇస్తుంటారు. విలువైన కానుక‌లు అంద‌జేస్తుంటారు. పెండ్లిరోజు నాడు ఓ భ‌ర్త త‌న భార్య‌ను ఆక‌ట్టుకోవ‌డానికి అనూహ్య చ‌ర్య‌కు దిగాడు. అనంత‌రం పోలీసు కేసు ఎదుర్కొన్నాడు. ఇంత‌కీ అత‌డు ఏమిచేశాడంటే..


త‌మ పెండ్లి రోజున భార్య‌ను ఆక‌ర్షించ‌డానికి రవిత్ కపూర్ అనే 25 ఏండ్ల యువ‌కుడు క‌దిలే కారుపై క్రాకర్ బాక్స్ పెట్టి ఆకాశంలోకి వెళ్లే ప‌టాకులు పేల్చాడు. ఈ ఘ‌ట‌న‌ను వెనుకాల వ‌స్తున్న ఓ వాహ‌న‌దారుడు వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పెట్టడంతో యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. త‌మ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భార్య‌ను ఇంప్రెస్ చేసేందుకు ఈ స్టంట్ చేసిన‌ట్టు క‌పూర్ చెప్పారు. పంజాబ్‌లోని మొహాలీలో బుధ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.