Parrot | చిలుక వాంగ్మూలం.. మ‌హిళ హ‌త్య కేసులో నిందితుల‌కు జీవిత ఖైదు

Parrot | చిలుక వాంగ్మూలం ఏంటి..? మ‌హిళ హ‌త్య( Woman Murder ) కేసులో నిందితుల‌కు జీవిత ఖైదు( Life imprisonment ) ఏంట‌ని అనుకుంటున్నారా..? కానీ మీరు చ‌దువుతున్న‌ది నూటికి నూరు శాతం నిజ‌మే. ఓ మ‌హిళ హ‌త్య కేసులో చిలుక( Parrot ) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఇద్ద‌రు నిందితుల‌కు జీవిత ఖైదు పడింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆగ్రా( Agra )కు చెందిన విజ‌య్ శ‌ర్మ‌, ఆయ‌న భార్య నీల‌మ్ శ‌ర్మ( Neelam Sharma […]

Parrot | చిలుక వాంగ్మూలం.. మ‌హిళ హ‌త్య కేసులో నిందితుల‌కు జీవిత ఖైదు

Parrot | చిలుక వాంగ్మూలం ఏంటి..? మ‌హిళ హ‌త్య( Woman Murder ) కేసులో నిందితుల‌కు జీవిత ఖైదు( Life imprisonment ) ఏంట‌ని అనుకుంటున్నారా..? కానీ మీరు చ‌దువుతున్న‌ది నూటికి నూరు శాతం నిజ‌మే. ఓ మ‌హిళ హ‌త్య కేసులో చిలుక( Parrot ) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఇద్ద‌రు నిందితుల‌కు జీవిత ఖైదు పడింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆగ్రా( Agra )కు చెందిన విజ‌య్ శ‌ర్మ‌, ఆయ‌న భార్య నీల‌మ్ శ‌ర్మ( Neelam Sharma ) క‌లిసి జీవిస్తున్నారు. అయితే నీల‌మ్ శ‌ర్మ 2014, ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన దారుణ హ‌త్య‌కు గురైంది. ఆ స‌మ‌యంలో విజ‌య్ శ‌ర్మ ఇంట్లో లేరు. నీల‌మ్‌తో పాటు ఆమె పెంపుడు కుక్క‌ను కూడా ప‌దునైన ఆయుధాల‌తో పొడిచి చంపిన‌ట్లు పోస్టుమార్టం( Postmortem ) నివేదిక‌లో తేలింది. అయితే ఈ కేసులో అనుమానితులుగా కొంద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన‌ప్ప‌టికీ స‌రైన సాక్ష్యాధారాలు ల‌భించ‌లేదు.

కీల‌క‌మైన చిలుక అరుపు..

విజయ్ శ‌ర్మ ఓ చిలుక‌ను కూడా పెంచుకుంటున్నాడు. నీల‌మ్ హ‌త్య‌కు గురైనప్ప‌టి నుంచి చిలుక స‌రిగ్గా తిన‌క‌పోవ‌డం, విజ‌య్ శ‌ర్మ మేన‌కోడ‌లు అషు ఇంటికి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చిలుక గ‌ట్టిగా అర‌వ‌డం ప్రారంభించింది. దీంతో హ‌త్య చేసిన వారిని చిలుక చూసి ఉంటుందనే అనుమానంతో విజ‌య్ పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఈ క్ర‌మంలో గ‌తంలో విచారించిన వారితో పాటు అషును కూడా పోలీసులు చిలుక ముందు నిల‌బెట్టారు. అషును చూసి చిలుకా గ‌ట్టిగా అరిచింది.

అంగీక‌రించిన మేన‌కోడ‌లు..

అషును చూసి చిలుక గ‌ట్టిగా అర‌వ‌డంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. రోన్నీ అనే వ్య‌క్తితో క‌లిసి తానే నీల‌మ్ శ‌ర్మ‌ను హ‌త్య చేసిన‌ట్లు అంగీక‌రించింది. పోలీసుల ఛార్జీషీట్‌లో చిలుక వాంగ్మూలం ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ, దాన్ని మాత్రం సాక్షిగా కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌లేదు.

ఆరు నెల‌లకు చిలుక మృతి

నీల‌మ్ శ‌ర్మ హ‌త్య‌కు గురైన ఆరు నెల‌ల‌కు చిలుక కూడా మృతి చెందింది. 2020 న‌వంబ‌ర్‌లో విజ‌య్ శ‌ర్మ కొవిడ్ బారిన ప‌డి చ‌నిపోయిన‌ట్లు కుమార్తె నివేదా తెలిపింది. మొత్తంగా ఈ కేసులో తీర్పు వెలువ‌రించిన ప్ర‌త్యేక న్యాయ‌స్థానం జ‌డ్జి రోన్నీ, అషుకు జీవిత ఖైదు విధించారు.