Love | మాజీ ప్రియురాలి కోసం 21 గంటల పాటు మోకాళ్లపై కూర్చున్న ప్రియుడు
Love | ఒకరికొకరు ఇష్టపడి.. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకున్నప్పుడే అది నిజమైన ప్రేమ( Love ) అవుతుంది. ఆ నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు.. ఆకస్మాత్తుగా ఎవరో ఒకరు దూరంగా వెళ్తే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. తనను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక సతమతమవుతుంటారు. నిత్యం వారి కోసమే పరితపిస్తుంటారు. ఆ మాదిరి సంఘటనే ఇది. చైనా( China )కు చెందిన ఓ వ్యక్తి ఓ యువతి( Woman )తో ప్రేమలో ఉన్నాడు. ఆమె కూడా […]

Love | ఒకరికొకరు ఇష్టపడి.. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకున్నప్పుడే అది నిజమైన ప్రేమ( Love ) అవుతుంది. ఆ నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు.. ఆకస్మాత్తుగా ఎవరో ఒకరు దూరంగా వెళ్తే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. తనను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక సతమతమవుతుంటారు. నిత్యం వారి కోసమే పరితపిస్తుంటారు. ఆ మాదిరి సంఘటనే ఇది.
చైనా( China )కు చెందిన ఓ వ్యక్తి ఓ యువతి( Woman )తో ప్రేమలో ఉన్నాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. కొద్ది రోజుల క్రితం ప్రియుడికి బ్రేకప్ చెప్పింది ప్రియురాలు. ఇక నాటి నుంచి ఆమె అతనితో మాట్లాడటం మానేసింది. కానీ తన ప్రియురాలు తనకు బ్రేకప్ చెప్పడం అతన్ని మరింత కుంగదీసింది. దీంతో ఆమె పని చేస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. ప్రియురాలు పని చేస్తున్న కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని తనను క్షమించమని కోరాడు. నీ ప్రేమ కావాలని కోరాడు. 21 గంటల పాటు మోకాళ్లపై కూర్చొని ప్రాధేయపడ్డాడు. గులాబీ పూలతో కూడిన బోకేను కూడా అక్కడ ఉంచాడు. వర్షం కురుస్తున్నప్పటికీ, చలి ఉన్నప్పటికీ అతను అలానే ఉండిపోయాడు. మార్చి 28వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ప్రియురాలిని క్షమాపణలు కోరుతూ.. మోకాళ్లపై మోకరిల్లాడు.
కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. ప్రియురాలు రాలేదు. అతన్ని క్షమించలేదు. చివరకు చలిని తట్టుకోలేక అటు నుంచి ప్రియుడు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.