9 మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకుని సైకిల్ స‌వారీ.. వీడియో వైర‌ల్

Bicycle Ride | విధాత:  సైకిల్‌పై ఒక‌రు లేదా ఇద్ద‌రు ప్ర‌యాణించొచ్చు. అత్య‌వ‌స‌ర‌మైతే ముగ్గురు కూడా ప్ర‌యాణించొచ్చు. కానీ ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా ఓ తొమ్మిది మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకుని సైకిల్ స‌వారీ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్ వైర‌ల్ అవుతుంది. ఓ వ్య‌క్తి త‌న సైకిల్‌పై తొమ్మిది పిల్ల‌ల‌ను ఎక్కించుకున్నాడు. అది సాధ్య‌మేనా అని మీకు అనుమానం రావొచ్చు. కానీ అత‌నికి సాధ్య‌మైంది. వెనుకాల ముగ్గురు పిల్ల‌ల‌ను కూర్చోబెట్టాడు. త‌న‌కు మూడు వైపులా […]

9 మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకుని సైకిల్ స‌వారీ.. వీడియో వైర‌ల్

Bicycle Ride | విధాత: సైకిల్‌పై ఒక‌రు లేదా ఇద్ద‌రు ప్ర‌యాణించొచ్చు. అత్య‌వ‌స‌ర‌మైతే ముగ్గురు కూడా ప్ర‌యాణించొచ్చు. కానీ ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా ఓ తొమ్మిది మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకుని సైకిల్ స‌వారీ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్ వైర‌ల్ అవుతుంది.

ఓ వ్య‌క్తి త‌న సైకిల్‌పై తొమ్మిది పిల్ల‌ల‌ను ఎక్కించుకున్నాడు. అది సాధ్య‌మేనా అని మీకు అనుమానం రావొచ్చు. కానీ అత‌నికి సాధ్య‌మైంది. వెనుకాల ముగ్గురు పిల్ల‌ల‌ను కూర్చోబెట్టాడు. త‌న‌కు మూడు వైపులా ముగ్గురిని నిల్చోబెట్టాడు.

ముంద‌రి భాగంలో మ‌రో ఇద్ద‌రిని, ముందు వీల్‌పై మ‌రో పాప‌ను కూర్చోబెట్టాడు. ఆ పిల్ల‌ల‌ను అలా కూర్చోబెట్టి సైకిల్ స‌వారీ చేయ‌డం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. ల‌క్ష‌లాది మంది లైక్ చేశారు.