Karnataka | భార్యతో అక్రమ సంబంధం.. ఫ్రెండ్ గొంతు కోసి రక్తం తాగేందుకు యత్నం
Karnataka | తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న స్నేహితుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు ఓ వ్యక్తి. పక్కా ప్లాన్ ప్రకారం.. ఫ్రెండ్‌ను ఓ ప్రదేశానికి పిలిపించాడు. ఆ తర్వాత అతని గొంతు కోశాడు. అనంతరం అతని రక్తాన్ని తాగేందుకు యత్నించాడు సదరు వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లపూర్‌కు చెందిన విజయ్‌కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. స్నేహితుడి మారేశ్.. విజయ్ ఇంటికి తరుచుగా వచ్చేవాడు. ఈ క్రమంలో విజయ్ భార్యతో […]

Karnataka |
తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న స్నేహితుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు ఓ వ్యక్తి. పక్కా ప్లాన్ ప్రకారం.. ఫ్రెండ్‌ను ఓ ప్రదేశానికి పిలిపించాడు. ఆ తర్వాత అతని గొంతు కోశాడు. అనంతరం అతని రక్తాన్ని తాగేందుకు యత్నించాడు సదరు వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లపూర్‌కు చెందిన విజయ్‌కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. స్నేహితుడి మారేశ్.. విజయ్ ఇంటికి తరుచుగా వచ్చేవాడు. ఈ క్రమంలో విజయ్ భార్యతో మారేశ్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం విజయ్‌కు తెలియడంతో.. మారేశ్‌ను మాట్లాడుకుందామని బయటకు పిలిపించాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన విజయ్.. మారేశ్ గొంతును పదునైన ఆయుధంతో కోశాడు.
అనంతరం మారేశ్ గొంతులో నుంచి వస్తున్న రక్తాన్ని తాగేందుకు విజయ్ యత్నించాడు. ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్స్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ వీడియో పోలీసుల దాకా చేరింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయ్‌పై కెంచర్లహళ్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మారేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయ్‌ను కఠినంగా శిక్షించాలని మారేశ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.