ప‌ట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. పడుకుని ప్రాణాలు కాపాడుకున్న ప్ర‌యాణికుడు.. (వీడియో)

Bihar | ఓ ప్ర‌యాణికుడు రైలు ప‌ట్టాలు దాటుతూ త‌న ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు. ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జి ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ట్టాల మీద నుంచి ప్లాట్‌ఫాం పైకి వెళ్లేందుకు య‌త్నించాడు. అది కూడా ఆగిఉన్న రైలు కింద నుంచి దూరుతూ.. ప‌ట్టాలు దాటే ప్ర‌య‌త్నం చేశాడు. అంత‌లోనే రైలు వేగంగా క‌ద‌ల‌డంతో.. స‌ద‌రు ప్ర‌యాణికుడు తెలివిగా క‌ద‌ల‌కుండా, ప‌ట్టాల‌పైనే బొర్ల‌బొక్కాలో ప‌డుకున్నాడు. రైలు ముందుకు వెళ్లిన త‌ర్వాత గ‌బ‌గ‌బ లేచి అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న బీహార్ […]

ప‌ట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. పడుకుని ప్రాణాలు కాపాడుకున్న ప్ర‌యాణికుడు.. (వీడియో)

Bihar | ఓ ప్ర‌యాణికుడు రైలు ప‌ట్టాలు దాటుతూ త‌న ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు. ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జి ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ట్టాల మీద నుంచి ప్లాట్‌ఫాం పైకి వెళ్లేందుకు య‌త్నించాడు. అది కూడా ఆగిఉన్న రైలు కింద నుంచి దూరుతూ.. ప‌ట్టాలు దాటే ప్ర‌య‌త్నం చేశాడు.

అంత‌లోనే రైలు వేగంగా క‌ద‌ల‌డంతో.. స‌ద‌రు ప్ర‌యాణికుడు తెలివిగా క‌ద‌ల‌కుండా, ప‌ట్టాల‌పైనే బొర్ల‌బొక్కాలో ప‌డుకున్నాడు. రైలు ముందుకు వెళ్లిన త‌ర్వాత గ‌బ‌గ‌బ లేచి అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న బీహార్ భాగ‌ల్‌పూర్‌లోని క‌హ‌ల్ గావ్ రైల్వేస్టేష‌న్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే ప్ర‌యాణికుడు ప‌ట్టాలు దాటుతున్న విష‌యాన్ని స్థానికులు గ‌మ‌నించారు. వ‌ద్ద‌ని వారించిన‌ప్ప‌టికీ అత‌ను అలానే ముందుకు క‌దిలాడు. రైలు వేగంగా క‌ద‌ల‌డం, ప‌ట్టాల‌పై ప్ర‌యాణికుడు ఉండిపోవ‌డం మిగ‌తా ప్ర‌యాణికుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింది. అత‌ను ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ప‌నులు చేయొద్ద‌ని అత‌న్ని నెటిజ‌న్లు హెచ్చ‌రించారు.