Mancherial | జిల్లా TUWJ (IJU).. జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Mancherial విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఐజేయూ అనుబంధం) జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలోని సురభి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీల పర్యవేక్షణలో నిర్వహిం చారు. ఎన్నికల పరిశీలకునిగా పెద్దపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ సంపత్ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షునిగా డేగ సత్యం ఆంధ్రజ్యోతి స్టాఫ్ రి […]

  • Publish Date - April 28, 2023 / 12:53 AM IST

Mancherial

విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఐజేయూ అనుబంధం) జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలోని సురభి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికలు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీల పర్యవేక్షణలో నిర్వహిం చారు. ఎన్నికల పరిశీలకునిగా పెద్దపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ సంపత్ వ్యవహరించారు.

జిల్లా అధ్యక్షునిగా డేగ సత్యం ఆంధ్రజ్యోతి స్టాఫ్ రి పోర్టర్, ప్రధాన కార్యదర్శిగా పింగిళి సంపత్ రెడ్డి భారత్ టుడే చానల్, కోశాధికారిగా కె. వం శ్రీకృష్ణ ప్రజాపక్షం, ఉపాధ్యక్షులుగా చౌదరి సురేష్ వెలుగు స్టాఫ్ రిపోర్టర్, మట్టెల సంజీవ్ దిశ, బి. వెంకటేశ్వర్లు నినాదం, ఆయిలీ రాజేష్ ఆంధ్రప్రభ, కొండ్ర శ్రీనివాస్

సాక్షి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కల్వల శ్రీనివాస్ అక్షరం, టి. కృష్ణమూర్తి ఆంధ్రజ్యోతి, రాయించు రమేష్ వెలుగు, తోట వెంకటేష్ సిటీ టైం, జాయింట్ సెక్రటరీగా బచ్చల సుభాష్ నేటి మనదేశం . శివ ప్రసాద్ స్కైలైన్, డబ్బెట తిరుపతి ఆంధ్రప్రభ. ఒజ్జల శ్రీనివాస్ ప్రభాత సమాచారం, నామినేనెట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా దేవరాజ్ ఏఎన్ఎస్, ఉపాధ్యక్షునిగా టి. రవిరాజ్ మన తెలంగాణ ఎంపికయ్యారు.

నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఎన్నికల సహాయకునిగా ఎర్రం ప్రభాకర్ వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఘనంగా సన్మానించారు.

Latest News