Manchiryala | ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. ఓ రోగిని మరో రోగి కత్తితో పొడిచి..
Manchiryala చికిత్స పొందుతూ మృతి విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గత మూడు రోజుల క్రితం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన చిలుక దేవయ్య (49 ) అనారోగ్యంతో గత మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం మంచిర్యాలలో నివాసం ఉంటున్న సుధాకర్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు . దేవయ్య పక్క బెడ్ లో చికిత్స నిమిత్తం […]

Manchiryala
- చికిత్స పొందుతూ మృతి
విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గత మూడు రోజుల క్రితం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన చిలుక దేవయ్య (49 ) అనారోగ్యంతో గత మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం మంచిర్యాలలో నివాసం ఉంటున్న సుధాకర్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు . దేవయ్య పక్క బెడ్ లో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయిన అర్ధరాత్రి కత్తితో చిలుక దేవయ్య పై ఛాతిపై పొడవడంతో పక్కనున్న అతని భార్య అరిచి సిబ్బందికి తెలపడంతో తేరుకున్న ఆసుపత్రి సిబ్బంది దేవయ్యను చికిత్స నిమిత్తం కిందికి తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆసుపత్రి సిబ్బంది మంచిర్యాల పోలీసులకు సమాచారం అందించారు.
గాయపడ్డ చిలుక దేవయ్యను వరంగల్ ఎంజి ఆసుపత్రికి వెంటనే తరలించారు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కత్తితో పొడిచిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన దేవయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
దేవయ్య మృతదేహం వరంగల్ నుండి ఈరోజు ఇటిక్యాలకు రాత్రి వరకు చేరుకుంటుందని సమాచారం.
ఆసుపత్రిలో నిందితుడు సుధాకర్ మూర్ఛ రోగంతో అడ్మిట్ అయ్యాడు. ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందో తెలియ రాలేదు.
అలాగే ఆసుపత్రికి నిందితుడు కత్తిని ఎందుకు తీసుకువచ్చాడు అనేది అనుమానస్పదంగా ఉంది. ఇంత జరిగినా ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమన్హారం. మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.