Manchiryala | మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

<p>Manchiryala విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాల్ లో శ‌నివారం అక్కల తిరుపతి వర్మ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరై జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేళాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది నిరుద్యోగులు తమ బయోడేటా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మెగా జాబ్ మేళాకు 99 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు మంచిర్యాలకు తరలివ‌చ్చారు. […]</p>

Manchiryala

విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాల్ లో శ‌నివారం అక్కల తిరుపతి వర్మ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరై జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేళాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది నిరుద్యోగులు తమ బయోడేటా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

మెగా జాబ్ మేళాకు 99 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు మంచిర్యాలకు తరలివ‌చ్చారు. దీంతో జాబ్ మేళాకు అత్య‌ధిక సంఖ్య‌లో నిరుద్యోగులు త‌ర‌లి వ‌చ్చారు. దీంతో ఎటు చూసిన సంద‌డి వాతావ‌ర‌ణం క‌నిపించింది.

ఈ సందర్భంగా నిర్వాహకుడు అక్కల తిరుపతి వర్మ మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన తాను మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల‌నే ఉద్దేశంతో హైదరాబాదులోని కార్పొరేట్ కంపెనీలను మంచిర్యాలకు తీసుకువచ్చానని పేర్కొన్నారు.

జిల్లా నలుమూలల నుండి వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తరలివచ్చారని తెలిపారు. సుమారు జిల్లావ్యాప్తంగా 5000 మంది యువతీ, యువకులు ఈ మెగా జాబు మేళాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతకు మ‌రిన్ని ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని తెలిపారు. అలాగే రాబోయే ఐదేళ్లలో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు 40 000 ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఏది ఏమైనప్ప‌టికి మంచిర్యాల జిల్లాలో పుష్కలమైన వనరులు ఉన్నాయని స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుకొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తాన‌ని పేర్కొన్నారు.

ఇదే రోజు కంపెనీ HR లు నిరుద్యోగ యువతీ యువకులతో ఇంటర్వ్యూలు నిర్వహించి సాయంత్రం ఐదు గంటల లోపు అపాయింట్ మెంట్ లెటర్ ఇస్తార‌ని తెలిపారు. ఇక్కడ నిర్వహించిన జాబు మేళాకు విశేష స్పందన చూసి అతి త్వరలో ఇదే ప్రాంతంలో మరో జాబ్ మేళా నిర్వహిస్తామని అక్కల తిరుపతివర్మ పేర్కొన్నారు.

Latest News