మంచు లక్ష్మీ.. ఇంత మంచిగా మారిపోయిందేంటి?

విధాత‌: తెలుగు సినీ రంగంలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పనిగట్టుకుని ఎవ‌రో ఒక‌రిపైన విమర్శలు చేసి.. వాళ్లని టార్గెట్ చేసుకునేలా చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల మంచు లక్ష్మీ మాత్రం తన గురించి ట్రోల్స్ చేసే వారిని పట్టించుకోనని అది తనకు సమయం వృధా చేస్తుందని కామెంట్ చేసింది. అంతేకాదు నేను చాలా మారిపోయాను. ఒకప్పటిలా కాదు. ఒకప్పుడు తప్పులు చేశాను. కానీ ఇకపై ఆ తప్పులు చేయను అంటూ వివరణ కూడా […]

మంచు లక్ష్మీ.. ఇంత మంచిగా మారిపోయిందేంటి?

విధాత‌: తెలుగు సినీ రంగంలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పనిగట్టుకుని ఎవ‌రో ఒక‌రిపైన విమర్శలు చేసి.. వాళ్లని టార్గెట్ చేసుకునేలా చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల మంచు లక్ష్మీ మాత్రం తన గురించి ట్రోల్స్ చేసే వారిని పట్టించుకోనని అది తనకు సమయం వృధా చేస్తుందని కామెంట్ చేసింది.

అంతేకాదు నేను చాలా మారిపోయాను. ఒకప్పటిలా కాదు. ఒకప్పుడు తప్పులు చేశాను. కానీ ఇకపై ఆ తప్పులు చేయను అంటూ వివరణ కూడా ఇచ్చింది. ఇక విషయానికి వస్తే సాధారణంగా సినిమాలలో పాటలు ప్రేక్షకులకు నచ్చితే వాటికి డాన్సులు వేస్తూ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. వీటిలో బాగా ఉన్న‌వి వైరల్ అవుతుంటాయి.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నుండి ‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదలైంది. సోషల్ మీడియాలో ఇది రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మిలియన్లకు మిలియ‌న్ల‌ వ్యూస్‌ని కొల్లగొడుతోంది. ఈ పాట ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటుంది.

దాంతో వారు ఆ పాటకు స్టెప్పులేస్తూ చిందులేస్తూ తన్మయత్వం చెందుతూ తద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తాజాగా బాస్ పార్టీ పాటకు మంచు లక్ష్మీ వేసిన మాస్ స్టెప్స్ చూస్తే అబ్బా అనిపించక మానదు. ఆమె డ్యాన్స్‌ను వీడియో కూడా తీసింది. ఇలా తీసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘రంగస్థలం’ ఫేమ్ మహేష్‌తో కలిసి మంచు లక్ష్మి ఈ పాటకు చాలా ఎనర్జిటిక్‌గా వేసిన స్టెప్పులు బాగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్స్ కూడా దీనికి పాజిటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. దీనికి లక్ష్మీ స్పందిస్తూ చిరు పాటలకు డాన్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన పాటలకు అప్పుడప్పుడు అలా డాన్స్ చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది.

ఇక వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొత్తానికి మంచు వారి అమ్మాయి ఎంతో మంచిగా మారి.. తమ ఫ్యామిలీకి విరోధులుగా వారు భావించే.. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కాంపౌండ్ చిత్రాల పాటలకు స్టెప్పులు వేయడం ఆహ్వానించదగిన పరిణామమే.