Manchu Manoj: మోహన్ బాబు.. నివాసం వద్ధ మంచు మనోజ్ ధర్నా

  • By: sr    latest    Apr 09, 2025 11:37 AM IST
Manchu Manoj: మోహన్ బాబు.. నివాసం వద్ధ మంచు మనోజ్ ధర్నా

విధాత: సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. జల్‌పల్లిలోని తన నివాసంలోకి తన అన్న మంచు మనోజ్ 150 మంది వ్యక్తులతో కలిసి అక్రమంగా చొరబడ్డారని.. వారు తనకు చెందిన కారు, వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్లారని నిన్న పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు.

అయితే.. ఈ దాడి అనంతరం.. చోరీకి గురైన తన కారు మంచు విష్ణు ఆఫీసులో కనిపిస్తోందని మనోజ్ పోలీసులకు తెలిపారు. దీనిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి, దొంగిలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు. కారు దొంగిలించిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం మంచు మనోజ్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి గేటు ముందు బైఠాయించాడు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.