Maneru River Front | అద్భుత పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్: మంత్రి గంగుల కమలాకర్

Maneru River Front | విధాత బ్యూరో, కరీంనగర్: మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా చరిత్రలో నిలువనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా చేపట్టబోయే పనులను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. […]

  • By: krs    latest    Aug 22, 2023 4:57 PM IST
Maneru River Front | అద్భుత పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్: మంత్రి గంగుల కమలాకర్

Maneru River Front |

విధాత బ్యూరో, కరీంనగర్: మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా చరిత్రలో నిలువనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.

ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా చేపట్టబోయే పనులను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. 24 టీఎంసీల మానేరు జలాశయాన్ని ఆద్భుతపర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది, ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించేలా తీగల వంతెన, మానేరురివర్ ఫ్రంట్ పనులను చేపడతామని తెలిపారు.

ఉజ్వల పార్కు నుండి తీగల వంతెన వరకు, లోయర్ ప్రామినెడ్, అప్పర్ ప్రామినెడ్ పనులు ఆ తరువాత సివిల్ పనులను చేపట్టాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా పెడస్టల్ బ్రిడ్జి, ఈకో మొబిలి కారిడార్, తెలంగాణ సంస్కృతి, పోరాటయోధుల గురించి వివరించేలా కట్టడాలు, బతుకమ్మగార్డెన్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

కార్యక్రమంలో కలెక్టర్ బీ గోపి, మేయర్ వై సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, టూరిజం ఎస్ఈ సరిత, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, ఎలక్ట్రిసిటీ ఎస్సీ గంగాధర్, కరీంనగర్ ఆర్డీఓ కే మహేశ్వర్, ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు హర్ష్ గోయల్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.