42శాతం అమలు శాస్త్రీయంగా చేయాలి: మాజీ మంత్రి గంగుల
బీసీ బిల్లు అమలును తమిళనాడు తరహాలో శాస్త్రీయ పరంగా చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో అన్నారు

హైదరాబాద్, ఆగస్టు 31(విధాత): బీసీ బిల్లు అమలును తమిళనాడు తరహాలో శాస్త్రీయ పరంగా చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో అన్నారు. అశాస్త్రీయంగా చేస్తే బీహార్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఫెయిల్ అయినట్లుగా అవుతుందని, వెనుకబడిన కులాలను మోసం చేయవద్దని ముందునుంచి చెప్తున్నామన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక జీవో ఇవ్వాలంటే.. మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పారు కదా, ఆదే రోజు జీవో ఇవ్వకుండా సుమారు ఆరు కమిటీలు ఎందుకు వేశారని ప్రశ్నించారు.