Manipur | ఎడిటర్స్ గిల్డ్‌పై.. మణిపూర్ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్
Manipur | హింసను ప్రెరేపించారంటూ అభియోగాలు విధాత: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్‌సింగ్ వెల్లడించారు. కొన్ని నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న జాతుల మధ్య ఘర్షణలు సద్ధుమణిగి శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితులలో మళ్లీ ఘర్షణలను సృష్టించేలా ఎడిటర్స్ గిల్డ్ సభ్యులు ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. అంతకుముందు జాతి హింసపై మీడియా నివేదికలు ఏక్షపక్షంగా […]

Manipur |
- హింసను ప్రెరేపించారంటూ అభియోగాలు
విధాత: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్‌సింగ్ వెల్లడించారు. కొన్ని నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న జాతుల మధ్య ఘర్షణలు సద్ధుమణిగి శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితులలో మళ్లీ ఘర్షణలను సృష్టించేలా ఎడిటర్స్ గిల్డ్ సభ్యులు ప్రయత్నించారని సీఎం ఆరోపించారు.
అంతకుముందు జాతి హింసపై మీడియా నివేదికలు ఏక్షపక్షంగా ఉన్నాయని, రాష్ట్ర నాయకత్వం పక్షపాతంగా వ్యవహారిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై మండిపడిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరింత హింసను ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్నారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా సీఎం బీరెన్‌సింగ్ తెలిపారు. ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సీమా ముస్తాఫా, సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్‌కపూర్ లపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
గత నెలలో మణిపూర్ రాష్ట్రంలో హింసకు సంబంధించి మీడియా నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్రంలో పర్యటించారు. అనంతరం వారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే మీడియా నివేదికలు ఏకపక్షంగా ఉన్నాయని, రాష్ట్ర నాయకత్వం పక్షపాతంగా వ్యవహారిస్తుందన్న నిర్ధారణకు వచ్చే ముందుగా ఎడిటర్ గిల్డ్ సభ్యులు అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని ఉండాల్సిందని, కొన్ని విభాగాలను కాదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.