Manipuri bridal look Viral| మణిపురి మయూరి సౌందర్యం..చూడతరమా!
మణిపూర్ వివాహాలలో సాంప్రదాయ పెళ్లి దుస్తులు ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఓ వివాహంలో సాంప్రదాయ మణిపురి పెళ్లి దుస్తులను ధరించిన వధువు లక్ష్మీదేవిలా మెరిసిపోతున్న వీడియో వైరల్ గా మారింది.
విధాత : విభిన్న జాతులు..సంస్కృతుల సమ్మిళత సమున్నత వైభవం భారత దేశం. దక్షిణ, ఉత్తర..ఈశాన్య రాష్ట్రాలలో భిన్న సంస్కృతులు..సాంప్రదాయాలు..ప్రజల జీవన శైలులు ఎంతో ప్రత్యేకమైనవే కాకుండా.. ఉన్నతమైనవిగా విరాజిల్లుతున్నాయి. ఉత్కృష్ట సాంస్కృతిక వారసత్వంలో మణిపూర్( Manipur)రాష్ట్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ రాష్ట్ర ప్రజల వేష భాషలు..జీవన శైలీతో పాటు వారి సాంస్కృతిక(Cultural Heritage) సంపదలో కీలకమైన మణిపురి నాట్యం ఎంతో ఖ్యాతిగాంచింది.
మణిపూర్ వివాహాలలో(Manipuri wedding) సాంప్రదాయ పెళ్లి దుస్తులు ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఓ వివాహంలో సాంప్రదాయ మణిపురి పెళ్లి దుస్తులను ధరించిన వధువు(bridal look Viral) లక్ష్మీదేవిలా మెరిసిపోతున్న వీడియో వైరల్ గా మారింది. అత్యంత అద్బుత ఆభరణాలతో బంగారు మయంగా రూపొందించిన దుస్తులను ధరించిన ఆ మహిళ.. నడుస్తున్న లక్ష్మీదేవిలా కదలాడుతూ అబ్బుర పరిచింది.
ఆమె నిర్మలమైన దేదీప్యమానమైన రూపం…ఈశాన్య భారతదేశ వివాహ సంప్రదాయాల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె రూపం రాజరిక, దైవిక కళతో పాటు మణిపురి సంప్రదాయపు వైభవానికి ప్రతీకగా ఆకట్టుకుందని ప్రశంసిస్తున్నారు.
Manipur : Bride Shines Like Goddess Lakshmi in Traditional Wedding Attire.
From intricate jewelry to her serene expressions, the look beautifully highlights the rich cultural heritage and timeless charm of Northeast India’s wedding traditions. Social media users are hailing her… pic.twitter.com/l4b1ppXyoX— Neha Gurung (@nehaGurung1692) December 28, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram