Adaso Kapesa | చరిత్ర సృష్టించిన మణిపూర్ మహిళ.. ప్రధాని మోదీ ఎస్పీజీ బృందంలో ‘అడాసో కపేసా’
Adaso Kapesa | దేశ ప్రధాని నరేంద్ర మోదీ( Narendra modi ) ఇటీవల ఇంగ్లండ్( England )లో పర్యటించిన సందర్భంగా ఓ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫొటోలో అంత ప్రత్యేకత ఏముందని మీరు అనుకోవచ్చు. ఆ ఫొటోలో నిజంగానే ప్రత్యేకత ఉంది. ప్రధానికి భద్రత కల్పించే ఎస్పీజీ కమాండోల బృందంలో ఓ మహిళకు స్థానం కల్పించడమే ఆ ఫొటో యొక్క ప్రత్యేకత.

Adaso Kapesa | ప్రధాని మోదీ( PM Modi ) ఇంగ్లండ్( England )లో పర్యటిస్తున్న వేళ.. ఓ మహిళా ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తూ ముందుకు కదిలారు. ఆ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆకస్మాత్తుగా మోదీ ఇంగ్లండ్ పర్యటనలో ఆమె ప్రధానికి సెక్యూరిటీ కల్పిస్తూ ప్రత్యక్షం అవడంతో.. అసలు ఆమె ఎవరు అనే తెగ సెర్చ్ చేశారు. అయితే ఆమె ఎస్పీజీ కమాండోలలో ఒకరు అని తేలింది.
మోదీకి సెక్యూరిటీ( Modi Security ) కల్పించిన ఆ మహిళ పేరు అడాసో కపేసా( Adaso Kapesa ). మణిపూర్( Manipur )కు చెందిన ఆమె వృత్తిరీత్యా ఇన్‌స్పెక్టర్. ఈశాన్య భారతదేశం( Northeast State ) నుండి ప్రధానమంత్రి భద్రతా విభాగానికి మొదటి మహిళా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అధికారిణిగా నియమించబడడంతో కపేసా చరిత్ర సృష్టించారు. అది కూడా అంతర్జాతీయ పర్యటన సందర్భంగా కావడంతో.. ఆమె అందరి దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలించారు.
ఎందుకంత ప్రాధాన్యత..?
భారతదేశంలో అత్యున్నత పదవులు అలంకరించిన వారికే ఎస్పీజీ కమాండోలు భద్రత కల్పిస్తారు. 24/7 వారికి రక్షణగా ఉంటారు. అయితే ఈ భద్రతా విధుల్లో చాలా వరకు పురుషులకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ కపేసా ఆ పురుషాధిక్యతను చెరిపేసి చరిత్ర సృష్టించారు. మోదీ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు.. ఆయనకు రక్షణగా అప్రమత్తంగా వ్యవహరించారు కపేసా. అలా ఆమె అందరి దృష్టిని ఆకర్షించి.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం అందుకుంది. ఈశాన్య రాష్ట్రాల యువతులకు కపేసా రోల్ మోడల్ అని నెటిజన్లు అభివర్ణించారు.
కపేసా ఉద్యోగం ఏమిటి..?
ఎస్పీజీ కమాండోలు అత్యంత కఠినమైన శిక్షణ తీసుకుంటారు. దేశంలోని వీవీఐపీలపై చీమను కూడా వాలనివ్వరు. అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తతతో విధులు నిర్వర్తిస్తుంటారు. నిఘా పెడుతూ.. శత్రు మూకలను తుదముట్టించేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ శిక్షణ కేవలం శారీరకంగా దృఢంగా ఉండేందుకు మాత్రమే కాదు.. ప్రతిదాడులను, శత్రువులను ఎదుర్కొనేందుకు వ్యూహం, త్వరితగతిన నిర్ణయం ఎలా తీసుకోవాలో కూడ నేర్పిస్తారు. వీటన్నింటిలో అడాసో కపేసా దిట్ట.. కాబట్టి ఆమెకు ప్రధాని భద్రతా సిబ్బందిలో స్థానం కల్పించారు.