Viral: రైలులో ఫుడ్ డెలివరీ.. షాకైన విదేశీయుడు! భారత్‌ను చూసి నేర్చుకోవాలని హితవు

విధాత: గతంలో మేం పాలించిన భారత దేశం..మేమే నాగరికత నేర్పాం..ఆంగ్ల విద్యను అందించాం.. రైళ్లను పరిచయం చేశాం..మేమే పారిశ్రామిక విప్లవాన్ని అందించామనుకున్నాడేమో ఓ బ్రిటన్ జాతీయుడు. మారిన ఆధునిక భారత్ అభివృద్ధిని చూసి షాక్ అయ్యాడు. భారత్‌లో యూకే జాతీయుడైన ఓ యూట్యూబర్ పర్యటిస్తున్నాడు. ట్రావెలింగ్‌లో భాగంగా యూపీలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కాన్పూర్ స్టేషన్ లో ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. రైలు స్టేషన్‌లో ఆగిన 5 నిమిషాల్లోనే జోమాటో డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేశాడు.
ఇది చూసి ఆశ్చర్యపోయిన సదరు యూట్యూబర్ షాక్ కు గురయ్యాడు. డెలివరీ బాయ్ తో సెల్ఫీ కూడా దిగాడు. తాను ఇంత తర్వగా.. అదికూడా రైలు ప్రయాణం మధ్యలో ఫుడ్ ఆర్డర్ డెలివరీ జరుగుతుందని ఊహించలేదన్నాడు. మా దేశం యూకే ఇప్పుడు భారత్‌ను చూసి నేర్చుకోవాలని పేర్కొన్నాడు. భారత్ చాల మారిపోయిందని..వేగంగా అభివృద్ధి చెందుతుందని అతడు అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు మేరా భారత్ మహాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.