Maoists | మావోయిస్టు నాయకులు మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డి క్షేమం
Maoists | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) నాయకులు మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), కట్టా రామచంద్రా రెడ్డి క్షేమంగా ఉన్నట్లు ఆపార్టీ (మావోయిస్టు) ఉత్తర్ సబ్ జోనల్ బ్యూరో, దండకారణ్యం, అధికార ప్రతినిధి మంగళి తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. వీరిద్దరూ మరణించినట్టుగా ఆగస్టు 19న తెలుగు, హిందీ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను భాకపా (మావోయిస్టు) పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఇద్దరు […]

Maoists |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) నాయకులు మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), కట్టా రామచంద్రా రెడ్డి క్షేమంగా ఉన్నట్లు ఆపార్టీ (మావోయిస్టు) ఉత్తర్ సబ్ జోనల్ బ్యూరో, దండకారణ్యం, అధికార ప్రతినిధి మంగళి తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వీరిద్దరూ మరణించినట్టుగా ఆగస్టు 19న తెలుగు, హిందీ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను భాకపా (మావోయిస్టు) పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఇద్దరు నాయకులూ క్షేమంగా, సురక్షితంగా వున్నారని, వాళ్ల క్షేమ సమాచారం కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తున్న యావత్తు విప్లవ ప్రజానీకానికీ, సంస్థలకు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకూ తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.
ప్రజలను అయోమయంలో ముంచెత్తడానికి, విప్లవ విజయం పట్ల అవిశ్వాసం కల్గించడానికి, మా నాయకుల ఆనుపానులు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల కనుసన్నల్లో మా పార్టీ నాయకుల అనారోగ్యాల పట్ల తరచూ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇది మా పార్టీకి వ్యతిరేకంగా పాలక వర్గాలు చేపట్టిన మానసిక యుద్ధంలో భాగమేనని, పాలక వర్గాలు చేసే ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు