Margadarshi cases | ఏపీ హైకోర్టుకు మార్గదర్శి కేసుల బదిలీకి సుప్రీం నో!!
Margadarshi cases విధాత: మార్గదర్శి చిట్ ఫండ్ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయించి ఇక్కడ రామోజీని మరింత ఇరుకున పెట్టాలని చూసిన జగన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులు తెలంగాణ హైకోర్టులోనే విచారించాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మార్గదర్శి కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి కేసులను బదిలీ చేయాలని జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అలా బదిలీ చేయడానికి కుదరదని చెప్పింది. మార్గదర్శి […]
Margadarshi cases
విధాత: మార్గదర్శి చిట్ ఫండ్ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయించి ఇక్కడ రామోజీని మరింత ఇరుకున పెట్టాలని చూసిన జగన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులు తెలంగాణ హైకోర్టులోనే విచారించాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
మార్గదర్శి కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి కేసులను బదిలీ చేయాలని జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అలా బదిలీ చేయడానికి కుదరదని చెప్పింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయ పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదనే ఏపీ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించకపోగా అసలు ఆ న్యాయ పరిధి అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది.
దీంతోబాటు చిట్ ఫండ్స్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ సీఐడికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఆ కేసును ఆంధ్రప్రదేశ్ పరిధికి తీసుకొచ్చి రామోజీని మరింత ఇరుకున పెట్టాలని జగన్ ప్రయత్నిస్తుండగా దానికి ఇప్పుడు విఘాతం కలిగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే మార్గదర్శి కేసులో వెయ్యి కోట్లకు పైగా ఆస్తులను సీఐడీ ఎటాచ్ చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram