Marri Janardhan Reddy | అడ్డొస్తే తొక్కేస్తా.. తిక్కలేపితే కాల్చి పడేస్తా! చేటు తెచ్చిన ఎమ్మెల్యే మర్రి ఘాటు వ్యాఖ్యలు

Marri Janardhan Reddy | నియోజకవర్గంలో ఎదురు వస్తే తాట తీస్తా ఇవి ప్రతిపక్ష పార్టీలపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్రోషం ఎమ్మెల్యే తీరుపై పలు పార్టీల నాయకుల మండిపాటు విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ప్రజా ప్రతినిధుల నోటి మాటలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీలంటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు. కొందరి నాయకుల మాటలు వింటే వీరా మన ప్రజాప్రతినిధులు అనే భావన ప్రతిఒక్కరిలో వచ్చింది. హుందాగా మెలగవలిసిన నేతలు […]

  • By: krs    latest    Aug 31, 2023 4:26 PM IST
Marri Janardhan Reddy | అడ్డొస్తే తొక్కేస్తా.. తిక్కలేపితే కాల్చి పడేస్తా! చేటు తెచ్చిన ఎమ్మెల్యే మర్రి ఘాటు వ్యాఖ్యలు

Marri Janardhan Reddy |

  • నియోజకవర్గంలో ఎదురు వస్తే తాట తీస్తా
  • ఇవి ప్రతిపక్ష పార్టీలపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్రోషం
  • ఎమ్మెల్యే తీరుపై పలు పార్టీల నాయకుల మండిపాటు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ప్రజా ప్రతినిధుల నోటి మాటలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీలంటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు. కొందరి నాయకుల మాటలు వింటే వీరా మన ప్రజాప్రతినిధులు అనే భావన ప్రతిఒక్కరిలో వచ్చింది. హుందాగా మెలగవలిసిన నేతలు అన్నీ విడిచి నోటి మాటలకు పనిచెపుతున్నారు.

ఈ కోవలోకే వస్తారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఈ మధ్య ఈ ఎమ్మెల్యేకు భరించనంత కోపం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిప్పులు కక్కుతున్నారు. ఓటమి పాలవుతున్నాననే భావన మనసులో పెట్టుకుని ఇతర పార్టీ నాయకులపై ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య నాగర్ కర్నూల్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రతి పనికి అడ్డువస్తున్నారని, ఇక నుంచి అడ్డు వస్తే తొక్కి పడేస్తానని ఆగ్రహం చెందారు. ఇంకా తనకు కోపం తెప్పిస్తే ఒక్కొక్కన్ని కాల్చి పడేస్తానని హెచ్చరించారు. సంయమనం పాటిస్తుంటే కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారని, తిక్కలేస్తే కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెపుతానని ఎమ్మెల్యే మర్రి హెచ్చరించారు. ఎమ్మెల్యే చేసిన ఘాటు వ్యాఖ్యలు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

ఒక ఎమ్మెల్యే గా ఉండి బెదిరింపు మాటలు మాట్లాడటంపై కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓడిపోతాననే ఉద్దేశంతో ఆయన సహనం కోల్పోయి కాంగ్రెస్ పై అక్కసు వెళ్ళగక్కుతున్నాడని మండిపడ్డారు. ఇలాంటి మాటలతో ఎమ్మెల్యే, ఇతర పార్టీల నాయకులను బెదిరించి అడ్డు లేకుండా చేయాలని చూస్తున్నాడని, ఆయన మాటలకు భయపడే వారు ఎవ్వరూ లేరని నాగం ఆగ్రహం చెందారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా కుల సంఘాల నాయకులు, ఇతర పార్టీల నాయకులు మర్రి మాటలపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మర్రికి తమ తడాఖ చూపిస్తామని ఇతర పార్టీల నాయకులు హెచ్చరిస్తు న్నారు. మర్రి చేసిన ఘాటు వ్యాఖ్యలు తన రాజకీయ భవిష్యత్ కు ఎలాంటి అవరోధం కలిపిస్తాయోనని సమాలోచనలో పడ్డారు. సొంత పార్టీ వారే మర్రి మాటలను తప్పు పడుతున్నారు. ఇలాంటి మాటలు భవిష్యత్ లో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని అంటున్నారు. ఏదిఏమైనా ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.