Mask Mandate | పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. మూడు రాష్ట్రాల్లో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు..!

Mask Mandate | దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ 5వేల నుంచి 6వేల మంది వరకు వైరస్‌ బారినపడుతున్నారు. అదే సమయంలో మృతుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న వైరస్‌ ముప్పును దృష్టిలో పెట్టుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో […]

Mask Mandate | పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. మూడు రాష్ట్రాల్లో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు..!

Mask Mandate | దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ 5వేల నుంచి 6వేల మంది వరకు వైరస్‌ బారినపడుతున్నారు. అదే సమయంలో మృతుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న వైరస్‌ ముప్పును దృష్టిలో పెట్టుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఉన్న సన్నద్ధతను అంచనా వేసేందుకు ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాక్ డ్రిల్‌ను కూడా ప్రకటించింది.

మూడు రాష్ట్రాల్లో మాస్క్‌ తప్పనిసరి..

పెరుగుతున్న ముప్పును దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో మళ్లీ మాస్క్‌ నిబంధనను తప్పనిసరి చేశాయి. కేరళ, పుదుచ్చేరిలో మాస్కులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. హర్యానా ప్రభుత్వం.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. కరోనా నివారణకు అవసరమైన నియమాలను పాటించాలని ప్రభుత్వం సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. జిల్లా, పంచాయతీ పాలకవర్గం పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా మాస్క్‌లు తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేయడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన అనంతరం కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడారు. కోవిడ్ సంబంధిత మరణాల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన, మధుమేహం తదితర వ్యాధులతో బాధపడుతున్నవారేనని చెప్పారు. ఈ సందర్భంగా ఆక్సిజన్‌ లభ్యత ఉండేలా చూసుకోవాలని ఆరోగ్యశాఖను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో ప్రైవేటు ఆసుపత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పుదుచ్చేరి పరిపాలన వెంటనే అమలులోకి వచ్చేలా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఒక ప్రకటనలో సూచించింది. గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా చోట్ల కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి తప్పనిసరి మాస్క్ సహా కరోనా నిబంధనలు అమలుకు సిద్ధమయ్యాయి. అలాగే, ప్రజలు ముందుజాగ్రత్తలు పాటించాలని పలు రాష్ట్రాలు ప్రజలకు సూచనలు చేస్తున్నాయి. దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవీయా.. ఆరోగ్య మౌలిక సౌకర్యాల సన్నద్ధతపై సమీక్షించాలని రాష్ట్రాలకు సూచించారు. దేశవ్యాప్తంగా సోమ, మంగళవారాలు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.