Site icon vidhaatha

Pendurthi | పెందుర్తి.. అమ్మవారి 40 తులాల వెండి కిరీటం చోరీ

Pendurthi |

విధాత, విశాఖ: పెందుర్తి నూకాలమ్మ దేవత ఆలయంలో ఆదివారం భారీ చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోకి ప్రవేశించి, అమ్మవారి 40 తులాల వెండి కిరీటం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో పెందుర్తి క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా,

5 నెలలుగా పూర్తిస్థాయిలో సీఐలు లేకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పలు కేసుల్లో పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version