Mexico Mayor | మొసలిని పెళ్లాడిన మేయర్.. ఎందుకో తెలుసా..?
Mexico Mayor | ఓ మేయర్.. ఆడ మొసలిని పెళ్లాడాడు. అదేదో మహిళనే పెళ్లి చేసుకోవచ్చు కదా..? అనే అనుమానం కలగొచ్చు. కానీ ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో సదరు మేయర్.. ఆడ మొసలిని వివాహం చేసుకున్నాడట. ఇదేదో ఈ రోజు సంప్రదాయం కాదట.. గత 230 ఏండ్లుగా తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. మరి ఆ పెళ్లి గురించి తెలుసుకోవాలంటే మెక్సికో వెళ్లాల్సిందే. […]

Mexico Mayor |
ఓ మేయర్.. ఆడ మొసలిని పెళ్లాడాడు. అదేదో మహిళనే పెళ్లి చేసుకోవచ్చు కదా..? అనే అనుమానం కలగొచ్చు. కానీ ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో సదరు మేయర్.. ఆడ మొసలిని వివాహం చేసుకున్నాడట. ఇదేదో ఈ రోజు సంప్రదాయం కాదట.. గత 230 ఏండ్లుగా తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. మరి ఆ పెళ్లి గురించి తెలుసుకోవాలంటే మెక్సికో వెళ్లాల్సిందే.
దక్షిణ మెక్సిలోని శాన్ పెడ్రో హువామొలులా అనే పట్టణానికి చెందిన మేయర్ విక్టర్ హ్యుగో సోసా.. ఆడ మొసలిని వివాహం చేసుకున్నాడు. అయితే చొంటల్, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతిని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో మొసలిని మేయర్ వివాహం చేసుకున్నారని స్థానికులు తెలిపారు. ఇలా ఆడ మొసలిని వివాహామాడడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మరింత అదృష్టం వరిస్తుందని స్థానికుల నమ్మకం. ఇక పెళ్లి కుమారుడిని చొంటల్ రాజుగా, మొసలిని రాణిగా భావిస్తారు.
The mayor of Mexico’s San Pedro Huamelula married a crocodile as part of a ritual to usher in a good harvest pic.twitter.com/JYByIWYbRb
— Reuters (@Reuters) July 2, 2023
ఈ పెళ్లి వేడుకను స్థానికులు ఘనంగా నిర్వహిస్తారు. పెళ్లికి ముందు మొసలిని స్థానికులు తమ నివాసాలకు తీసుకెళ్లి.. ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలిని వస్త్రాలతో అలంకరిస్తారు. అది నోరు తెరవకుండా ఉండేందుకు, దాని ముక్కుకు తాడును కూడా కడుతారు.
మత్స్యకారులు వలలతో నృత్యాల్లో పాల్గొంటారు. వరుడు మొసలిని ఎత్తుకుని నృత్యం చేసి దాని నుదుటిపై ముద్దు పెట్టడంతో వేడుక ముగుస్తుంది. మేం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం.. నేను నా భార్య పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాను అని సోసా పేర్కొన్నారు.