Medak | భక్తులతో కిటకిటలాడిన ‘ఏడుపాయల’
Medak విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు.. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకున్నారు. అయితే సుదూర ప్రాంతాల నుండి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది, […]

Medak
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు.. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకున్నారు. అయితే సుదూర ప్రాంతాల నుండి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇటీవల వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది, ఇది ఇలా ఉండగా పలువురు భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలా లు, బోనాలు, సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా , ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, రవివీర్ కుమార్, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్ తదితరులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వేద పండితులు శంకర శర్మ, పార్థివ శర్మ, రామశర్మ, మురళీధర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించగా పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.