Medak ప్రజ్ఞపూర్ హరిత హోటల్లో విలేఖర్ల సమావేశం దున్నపోతు దుమారం పై స్పందించిన ఈటల వయస్సు, అనుభవం ఉన్న జితేందర్ రెడ్డి జాగ్రతగా మాట్లాడాలి జితేందర్ రెడ్డి ట్వీట్ పై ఆయననే అడగాలి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పురపాలక సంఘం పరిధిలోని ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ లో హైదరాబాదు నుండి సిద్దిపేట వైపు వస్తున్న తరుణంలో ప్రజ్ఞాపూర్ లోని హరిత హోటల్లో అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ […]
Medak
విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పురపాలక సంఘం పరిధిలోని ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ లో హైదరాబాదు నుండి సిద్దిపేట వైపు వస్తున్న తరుణంలో ప్రజ్ఞాపూర్ లోని హరిత హోటల్లో అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ…. సీఎం కేసీఆర్ కు అందుబాటులో ఇటు బిజెపిలో అటు కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారన్నారు. ఎవరైనా అటు రాజకీయంగా గాని ఇటు ఆర్థికంగా గాని ఎదుగుతుంటే సీఎం కేసీఆర్ ఓర్వ లేరని అన్నారు.
అందుకే బీ ఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇటు చెప్పుకోలేక అటు బయటకు పోలేక నిత్యం నరకం అనుభవిస్తూ ఉంటున్నారని దానికి నిదర్శనం నేనేనని ఆయన ఘాటుగా సంచలాత్మకమైన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా బిజెపిలో ఉన్న గత రెండు రోజుల క్రితం బిజెపిలో ఉన్న పార్టీ నాయకులు దున్నపోతు లాగా నిద్రపోతున్నారని వారికి ముల్లుకట్టతో ఒడిసి పార్టీ పెడతానికి ఉరుకుల పరుగులు చేయించాలని అన్న వ్యాఖ్యలపై జితేందర్ రెడ్డికి చెప్పకనే చెప్పి తనదైన స్టైల్ లో హెచ్చరించారు.
జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలనీ, వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఏదీ పడితే అది మాట్లాడకూడదు.
ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. స్వేచ్ఛ, గౌరవం తగ్గించకుండా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు.