Medak | ‘మీకోసం’ తరలివచ్చిన జనం.. సమస్యలు పరిష్కరించిన MLA పద్మదేవేందర్‌రెడ్డి
Medak విధాత, మెదక్ బ్యూరో: మెదక్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమం మంగళ వారం మెదక్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమ సమస్యలు విన్నవించేందుకు భారీగా ప్రజలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట ఆర్, హవేలీఘనాపూర్ మండలాల నుంచి ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, డబల్ బెడ్ రూమ్, రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు ప్రజలు […]

Medak
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమం మంగళ వారం మెదక్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమ సమస్యలు విన్నవించేందుకు భారీగా ప్రజలు హాజరయ్యారు.
నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట ఆర్, హవేలీఘనాపూర్ మండలాల నుంచి ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, డబల్ బెడ్ రూమ్, రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. అందుబాటులో లేని అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలను వివరించి పరిష్కార దిశగా కృషి చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్య రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణ రెడ్డి, భీమరి కిషోర్, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మెదక్ రైతుబంధు అధ్యక్షులు కిష్టయ్య, హవేళిఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ఎమ్మార్వో నవీన్‌కుమార్, మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.