Medak | విద్యార్థినిని వేధించిన PETకి దేహశుద్ధి.. సస్పెండ్ చేసిన కలెక్టర్
Medak సిర్గాపూర్ ZPHSలో ఘటన విధాత, మెదక్ బ్యూరో: చదువు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామంతో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గ్రామస్తులు, తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ (Sirgapur) మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిర్గాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ (PET) ఉపాధ్యాయుడు సంగ్రామ్ (Sangram) పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో […]

Medak
- సిర్గాపూర్ ZPHSలో ఘటన
విధాత, మెదక్ బ్యూరో: చదువు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామంతో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గ్రామస్తులు, తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ (Sirgapur) మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
సిర్గాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ (PET) ఉపాధ్యాయుడు సంగ్రామ్ (Sangram) పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు.
ఇదే సమయంలో పిఈటి సంగ్రామ్ రావడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. వెంటనే ప్రధానోపాధ్యాయున్ని, పీఈటి సంగ్రామ్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పీఈటి సంగ్రామ్ విషయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పీఈటి సంగ్రామ్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కాగా వెంటనే వారిని విధుల నుండి తొలగించాలని పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
పిఈటీ సస్పెండ్
పి ఈ టీ సంగ్రామ్ ను జిల్లా కలెక్టర్ శరత్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.