Medak | చెరుకు రైతులు అధైర్య పడొద్దు: మంత్రి హ‌రీష్‌రావు

Medak | బకాయిలు ఇప్పించే బాధ్యత మాది చెరుకు రైతులకు బకాయిలు రూ.14.15కోట్లు చెల్లించాలి కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఈ సీజన్లో చెరకు క్రషింగ్ కావాలి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు, కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరిశ్రమ యాజమాన్యాన్ని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని మినీ […]

Medak | చెరుకు రైతులు అధైర్య పడొద్దు: మంత్రి హ‌రీష్‌రావు

Medak |

  • బకాయిలు ఇప్పించే బాధ్యత మాది
  • చెరుకు రైతులకు బకాయిలు రూ.14.15కోట్లు చెల్లించాలి
  • కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి
  • ఈ సీజన్లో చెరకు క్రషింగ్ కావాలి
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు, కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరిశ్రమ యాజమాన్యాన్ని ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ట్రైడెంట్ యాజమాన్యం, సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తో కలిసి చెరుకు రైతుల పెండింగ్ బిల్లుల చెల్లింపు పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రైడెంట్ పరిశ్రమ యాజమాన్యంకు ఎన్ని మార్లు గడువు ఇచ్చిన రైతులకు బకాయిలు చెల్లించకుండా ఏదో కారణం చెబుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. పరిశ్రమ యాజమాన్యం తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత సీజన్ లో చెరుకు సరఫరా చేసిన రైతులకు ఇంకా రూ.14.15 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. యాజమాన్యం జూలై 15 వ తేదీ లోగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, నెల రోజులు కావస్తున్న ఇంతవరకు పూర్తిస్థాయిలో చెల్లించక పోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నడపాలన్నదే మా ఉద్దేశమన్నారు.

ఈ సందర్భంగా పరిశ్రమ యాజమాన్యం ఈనెల 17వ తేది నుండి 31వ తేదీలోపు చెరకు బకాయిలు రైతులకు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల చివరి వారంలో ఫ్యాక్టరీ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని, ఫ్యాక్టరీ మిషనరీ మరమ్మత్తులు చేసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని మంత్రికి తెలిపారు. అదేవిధంగా ఈ సీజన్లో క్రషింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటామని మంత్రికి తెలిపారు.

చెరకు రైతుల ఎవరు అదై ర్యపడవద్దని, యాజమాన్యం ప్రతి ఒక్క రైతుకు బకాయలు చెల్లించేలా అన్ని చర్యలు తీసుకుంటు న్నామని , తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ సీజన్లో చెరుకు క్రషింగ్ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నా
మన్నారు. ప్రభుత్వం రైతులకు, కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

ఈ సమావే శంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీఎం ఎస్ చైర్మన్ శివకుమా ర్,మాజీ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, అసిస్టెంట్ కేన్ కమిషనర్ రాజశేఖర్, లేబర్ శాఖ అధికారి, జహీరాబాద్ ఆర్డీవో వెంకారెడ్డి, డి.ఎస్.పి., తదితరులు పాల్గొన్నారు.