Medaram Jatara | మేడారం మహాజాతర తేదీలు ఖరారు

ప్రకటించిన సమ్మక్క సారలమ్మ పూజారులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం (Medaram Jatara) సమ్మక్క, సారలమ్మ - 2024 జాతర తేదీలు ఖరారు చేశారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర చత్తీస్గడ్ మధ్యప్రదేశ్ ల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో ఈ జాతరకు హాజరవుతారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర కోయ గిరిజనులకు అత్యంత ప్రధాన జాతరగా పేర్కొంటారు. 2024 ఫిబ్రవరిలో జరిగే మహజతర […]

  • By: Somu |    latest |    Published on : May 03, 2023 10:55 AM IST
Medaram Jatara | మేడారం మహాజాతర తేదీలు ఖరారు
  • ప్రకటించిన సమ్మక్క సారలమ్మ పూజారులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం (Medaram Jatara) సమ్మక్క, సారలమ్మ – 2024 జాతర తేదీలు ఖరారు చేశారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర చత్తీస్గడ్ మధ్యప్రదేశ్ ల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో ఈ జాతరకు హాజరవుతారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర కోయ గిరిజనులకు అత్యంత ప్రధాన జాతరగా పేర్కొంటారు.

2024 ఫిబ్రవరిలో జరిగే మహజతర తేదీలను సమ్మక్క, సారలమ్మ పూజారులు బుధవారం ప్రకటించారు. ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీన దేవతల వనప్రవేశం ఉండగా… ఫిబ్రవరి 28వ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.