Medical Colleges | రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

Medical Colleges విధాత: తెలంగాణ ప్రభుత్వం జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరు చేసిన ఎనిమిది మెడికల్ కళాశాలలతో కలిపి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాల సంఖ్య 56కు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. జిల్లా కేంద్ర ఆసుపత్రికి […]

Medical Colleges | రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

Medical Colleges

విధాత: తెలంగాణ ప్రభుత్వం జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు మెడికల్ కళాశాలల ఏర్పాటుకు
అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరు చేసిన ఎనిమిది మెడికల్ కళాశాలలతో కలిపి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాల సంఖ్య 56కు చేరింది.

యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. జిల్లా కేంద్ర ఆసుపత్రికి అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 100 సీట్లతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు ఆర్అండ్ బీ, టీఎస్ఎంఐడీసీలను ఆదేశించింది.

ఈ “మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా మంజూరైన యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాలతో కలిపి ఇప్పటికే మంజూరు అయిన‌ నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలల ఏర్పాటుతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే బీబీనగర్‌లో ఏయిమ్స్ ఉండగా, కొత్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరుతో జిల్లా వైద్య రంగంలో గణనీయ రీతిలో పురోగమించనుంది.

ములుగు, నర్సంపేటలో కొత్త మెడికల్ కాలేజీలు..

సీఎంకు ఎమ్మెల్యే పెద్ది ధన్యవాదాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మ‌రో 8 కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు నర్సంపేట లకు నూతనంగా మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తూ నిర్ణయించారు. ములుగు జిల్లా కేంద్రం కాగా, వరంగల్ జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని నర్సంపేటలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండలో జిల్లాలో కాకతీయ మెడికల్ కాలేజ్ ఉండగా నూతనంగా జనగామ, మహబూబాబాద్, భూపాల్ పల్లి జిల్లాలలో ఇప్పటికే మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. తాజాగా మిగిలిన వరంగల్, ములుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలను కేటాయించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయినట్లుగా భావించవచ్చు.

ఈ తాజా నిర్ణయంతో ఒక్కో జిల్లాకు ఒక్క మెడిక‌ల్ కాలేజీ ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ క‌ల సాకారం అవుతోంది. ప్రతీ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీ క‌లిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10 వేల‌కు చేరువ కానున్నాయి. వీటికి అనుసంధానంగా హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చెందనున్నాయి.

నర్సంపేటలో మెడికల్ కాలేజ్

వరంగల్ జిల్లాకు రావాల్సిన మెడికల్ కాలేజీని వరంగల్‌లో కాకుండా నర్సంపేటలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే నగరంలో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం, కొత్తగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నందున వరంగల్ జిల్లాకు కేటాయించిన కొత్త మెడికల్ కాలేజీని నర్సంపేటలో ఏర్పాటు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వానికి పరిస్థితిని విన్నవించి తన నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే విధంగా కృషి చేసినట్లు సమాచారం. నర్సంపేట ములుగు ఏజెన్సీకి వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నర్సంపేట పై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ ఉందని తమ ప్రాంతానికి కానుకగా భావిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.