OLA | ఓలా కొత్త ఉద్యోగి పేరు బిల్జీ.. మ‌నిషీ కాదు.. రోబో కాదు.. మ‌రేంటి?

OLA | ఓలా (OLA) స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు భ‌వీష్ అగ‌ర్వాల్‌ ట్విట‌ర్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఆయ‌న పోస్ట్ చేసింది.. త‌మ సంస్థ‌లో కొత్త‌గా చేరిన బిల్జీ అనే కొత్త ఉద్యోగి ఐడెంటిటీ కార్డ్‌ను. మ‌రి అందులో చెప్పుకోవాల్సింది ఏముందంటారా.. బిల్జీ అంటే మ‌నిషి కాదు.. పోనీ ఇప్పుడు రోబోలు వాడ‌టం స‌ర్వ‌సాధార‌ణం కాబ‌ట్టి అదే అనుకుందామా అంటే కాదు. బిల్జీ అంటే కుక్క‌ (Dog). ఆ పేరుకు విద్యుత్ అని అర్థం. ఆ […]

  • Publish Date - August 1, 2023 / 09:23 AM IST

OLA |

ఓలా (OLA) స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు భ‌వీష్ అగ‌ర్వాల్‌ ట్విట‌ర్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఆయ‌న పోస్ట్ చేసింది.. త‌మ సంస్థ‌లో కొత్త‌గా చేరిన బిల్జీ అనే కొత్త ఉద్యోగి ఐడెంటిటీ కార్డ్‌ను. మ‌రి అందులో చెప్పుకోవాల్సింది ఏముందంటారా.. బిల్జీ అంటే మ‌నిషి కాదు.. పోనీ ఇప్పుడు రోబోలు వాడ‌టం స‌ర్వ‌సాధార‌ణం కాబ‌ట్టి అదే అనుకుందామా అంటే కాదు.

బిల్జీ అంటే కుక్క‌ (Dog). ఆ పేరుకు విద్యుత్ అని అర్థం. ఆ క్యూట్ కుక్క‌ను చూసిన ట్విట‌ర్ (Twitter) యూజ‌ర్లు దాంతో ప్రేమ‌లో ప‌డిపోయారు. ఎంత‌లా అంటే పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాల‌కే 1400 లైక్ లు వ‌చ్చేంతగా.. ఆ ఐడీ కార్డుపై బిల్జీ ఎక్క‌డ ప‌ని చేస్తుంద‌నే వివ‌రాలు కూడా ఇచ్చారు.

ఎంప్లాయీ కోడ్ 440 వోల్ట్‌లు, బ్ల‌డ్ గ్రూప్ పీఏడ‌బ్ల్యూ పాజిటివ్ అని పేర్కొన్నారు. త‌న‌ను కాంటాక్ట్ అవ్వాలంటే స్లాక్‌లో మాట్లాడొచ్చ‌ని.. అత్య‌వ‌స‌రంగా క‌ల‌వాలంటే భ‌వీష్ అగ‌ర్వాల్ ఆఫీసులో ఉంటాన‌ని ఆ కుక్క ఐడీపై ఉంది. బిల్జీ ప్ర‌స్తుతం బెంగ‌ళూరు (Bengaluru) కోర‌మంగ‌ళ బ్రాంచ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ప్ర‌స్తుతం ఓలా ఎలక్ట్రిక్ ఓలా ఎస్ 1 స్కూట‌ర్ల‌ బుకింగ్‌ల‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి సుమారు రూ.1.09 ల‌క్ష‌లకు లభించనుండ‌గా.. నేరుగా కొనుక్కునే వారికి మ‌రో రూ.10 వేలు అద‌నంగా ప‌డ‌నుంది.

ఓలా ఎస్ 1 స్కూట‌ర్ .. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న ఏథ‌ర్ 450 ఎస్‌, టీవీఎస్ ఐ క్యూబ్‌ల‌కు పోటీ ఇవ్వ‌నుంది. టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్క్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బ‌ర్స్‌, డ్ర‌మ్ బ్రేక్స్ మొద‌లైన ఆధునిక ఫీచ‌ర్ల‌ను ఈ స్కూట‌ర్‌కు ఇచ్చారు. న్యూ నియాన్ గ్రీన్ అనే కొత్త రంగులో ఎస్ 1 అల‌రించ‌నుంది.

Latest News