Megastar Chiranjeevi | నాకు ఏ క్యాన్సర్ లేదు.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి: చిరంజీవి
Megastar Chiranjeevi | Cancer విధాత: నాకు ఎలాంటి క్యాన్సర్ లేదని ఈ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని మెగాస్టార్ చిరంజీవి కోరారు. శనివార్ హైదరాబాద్‌లో ఓ క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు జనంలోకి తప్పుగా వెళ్లాయి. చిరంజీవికి క్యాన్సర్ అంటూ తెగ వైరల్ అయ్యాయి. ఈనేపథ్యంలో మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. నాకు ఏ విధమైనా క్యాన్సర్ లేదని ఓ ప్రైవేటు కార్యక్రమంలో క్యాన్సర్ పై […]

Megastar Chiranjeevi | Cancer
విధాత: నాకు ఎలాంటి క్యాన్సర్ లేదని ఈ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని మెగాస్టార్ చిరంజీవి కోరారు. శనివార్ హైదరాబాద్‌లో ఓ క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు జనంలోకి తప్పుగా వెళ్లాయి. చిరంజీవికి క్యాన్సర్ అంటూ తెగ వైరల్ అయ్యాయి. ఈనేపథ్యంలో మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
నాకు ఏ విధమైనా క్యాన్సర్ లేదని ఓ ప్రైవేటు కార్యక్రమంలో క్యాన్సర్ పై అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడానన్నారు. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించ వచ్చని, నేను అలర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకోగా అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారని చెప్పానన్నారు.
అయితే ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ నని అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో ‘ చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారని ‘చికిత్స వల్ల బతికాడంటూ’ స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలవడంతో అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడిందని అన్నారు.
అదేవిధంగా అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారని వారందరి కోసం ఈ క్లారిటీ ఇస్తున్నాను అంటూ తన సామాజికి మాధ్యమాల ద్వారా తెలిపారు. అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా జర్నలిస్టులు అవాకులు చవాకులు రాయవద్దని తద్వారా అనేక మంది భయభ్రాంతులకు గురవుతారంటూ చిరంజీవి విజ్ఞప్తి చేశారు.