HYD మెట్రో శుభవార్త.. ఇకపై రాత్రి 11 వరకు సేవలు!
విధాత, హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త తెలిపింది. మెట్రో సర్వీసుల వేళలను పొడిగించారు. ఇక నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ వెల్లడించారు. ఉదయం ఎప్పటిలాగే 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చివరి మెట్రో రాత్రి 10:15 గంటల వరకే […]

విధాత, హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త తెలిపింది. మెట్రో సర్వీసుల వేళలను పొడిగించారు. ఇక నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ వెల్లడించారు. ఉదయం ఎప్పటిలాగే 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చివరి మెట్రో రాత్రి 10:15 గంటల వరకే అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని 11 గంటల వరకు పొడిగించడంతో.. ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.