Minister Botsa | ఏపీలో నేటి నుంచే ఉపాధ్యాయుల బదిలీలు
Minister Botsa విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభమౌతుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా బదిలీలు చేపడతామన్నారు. 675 ఎంఈవో-2 పోస్టులకు సంబంధించి గురువారం జీవో జారీ చేస్తామన్నారు. 350 మంది గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, 9269 మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. 1,746 మంది పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియను రేపటి నుంచే […]
Minister Botsa
విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభమౌతుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా బదిలీలు చేపడతామన్నారు.
675 ఎంఈవో-2 పోస్టులకు సంబంధించి గురువారం జీవో జారీ చేస్తామన్నారు. 350 మంది గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, 9269 మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. 1,746 మంది పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియను రేపటి నుంచే ప్రారంభిస్తామని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. బదిలీలు పూర్తయిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపడుతామని మంత్రి చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram