Balagam: బలగం మొగిలయ్యను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

మెరుగైన‌ వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించిన మంత్రి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నో కుటుంబాలను కలుపుతున్న బలగం సినిమాలో… నా తోడుగా నా తోడు ఉండి అనే పాట పాడిన బుడగ జంగాల కళాకారుడు, కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న మొగిలయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, మెరుగైన‌ వైద్యం […]

Balagam: బలగం మొగిలయ్యను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
  • మెరుగైన‌ వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించిన మంత్రి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నో కుటుంబాలను కలుపుతున్న బలగం సినిమాలో… నా తోడుగా నా తోడు ఉండి అనే పాట పాడిన బుడగ జంగాల కళాకారుడు, కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న మొగిలయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు.

మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, మెరుగైన‌ వైద్యం అందిస్తున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి మొగిలయ్య ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

మొగిలయ్యను కలిసిన వారిలో బిఆర్ ఎస్ నాయకులు సాంబారి సమ్మారావు, బుడిగ జంగాల సంఘం నాయకుడు చింతల యాదగిరి, సీఎం ఓ ఎస్ డి డాక్టర్ గంగాధర్, తదితరులు ఉన్నారు.