Minister Gajendra Singh | సనాతన ధర్మాన్ని దూషిస్తే.. గుడ్లు, నాలుక పీకేస్తాం: గజేంద్ర సింగ్
Minister Gajendra Singh జైపూర్: సనాతన ధర్మంపై ఎవరైనా ఇష్టం వచ్చినట్టు దూషిస్తే.. వారి కనుగుడ్లు, నాలుక పీకేస్తామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హెచ్చరించారు. ఇటీవల తమిళనాడు మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దానిని సమూలంగా నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం రాజస్థాన్‌లోని బర్మార్‌లో నిర్మహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన కేంద్రమంత్రి.. సనాతన […]

Minister Gajendra Singh
జైపూర్: సనాతన ధర్మంపై ఎవరైనా ఇష్టం వచ్చినట్టు దూషిస్తే.. వారి కనుగుడ్లు, నాలుక పీకేస్తామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హెచ్చరించారు.
ఇటీవల తమిళనాడు మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దానిని సమూలంగా నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మంగళవారం రాజస్థాన్‌లోని బర్మార్‌లో నిర్మహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన కేంద్రమంత్రి.. సనాతన ధర్మాన్ని మన పూర్వీకులు ఎన్నో కష్టాలకోర్చి, కాపాడి, నేటి తరాలకు అందించారని చెప్పారు. బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ్య కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసమే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు.
ఉదయనిధి స్టాలిన్, ప్రకాశ్‌రాజ్ వంటివారిని ఉద్దేశించి.. అటువంటివారు ప్రజల్లో హీరోలు కాలేరని, విలన్లు గానే ప్రజల్లో మిగిలి పోతారని చెప్పారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు రాజకీయంగా ఎదగ లేరని ఆమె తేల్చి చెప్పారు.